హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Adipurush: ప్రభాస్ ’ఆదిపురుష్’లో సీతగా జాతీయ ఉత్తమ నటి.. ? ఇదే ఫైనల్ అంటున్న మూవీ మేకర్స్..

Prabhas - Adipurush: ప్రభాస్ ’ఆదిపురుష్’లో సీతగా జాతీయ ఉత్తమ నటి.. ? ఇదే ఫైనల్ అంటున్న మూవీ మేకర్స్..

ప్రభాస్ ఆదిపురుష్ Photo : Twitter

ప్రభాస్ ఆదిపురుష్ Photo : Twitter

Prabhas Adipurush | రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్ని కూడా బాహుబలి లెవల్లోనే భారీగా ప్యాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రను కోసం జాతీయ ఉత్తమ నటిని ఎంపిక చేసినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

  Prabhas Adipurush | రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్ని కూడా బాహుబలి లెవల్లోనే భారీగా ప్యాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. మొత్తం భారత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా ఇప్పుడు ప్రభాస్‌పైనే ఉంది. ఈయన కోసమే ప్రత్యేకంగా కథలు రెడీ చేస్తున్నారు. అలా చేసిన ఓ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. తానాజీ దర్శకుడు ఓం రౌత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది.అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయిన ప్రేక్షకులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

  ‘ఆదిపురుష్’ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. కానీ సెట్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో కాస్త బ్రేక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్.. ముంబైలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసాడు. ఈ సినిమాలో ఇప్పటికే లంకేష్ అదేనండి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్టు అఫీషియ‌ల్‌గా ప్రకటించారు. మరోవైపు ఈ సినిమాలో లక్ష్మణుడిగా సన్ని సింగ్ పేరు వినిపించింది. తాజాగా ‘యూరీ’ ఫేమ్ విక్కీ కౌశల్‌‌ను ఈ సినిమాలో లక్ష్మణుడిగా ఎంపిక చేసినట్టు సమాచారం. 

  ఆదిపురుష్‌గా ప్రభాస్ (Twitter/Photo)

  అంతేకాదు ఇప్పటికే ప్రభాస్.. ఈ సినిమా కోసం విలు విద్యలో  ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇందులో సీత ఎవరు అనేది హాట్ టాపిక్ అయిపోయింది. చారిత్రాత్మక నేపథ్యంలో యాక్షన్ 3డిగా వస్తున్న ఈ చిత్రంలో సీత పాత్ర కోసం జాతీయ ఉత్తమ నటి కీర్తిసురేష్ నటించబోతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కియారా అద్వానీ,అనుష్క శర్మ,కృతి సనన్ పేర్లు వినిపించాయి. దాదాపు కృతి సనన్ పేరు ఖరారైనట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ‘ఆదిపురుష్’‌లో సీత పాత్ర కోసం కీర్తి సురేష్ పేరును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.

  ప్రభాస్ ఆది పురుష్ (adipurush prabhas)
  ప్రభాస్ ఆది పురుష్ (adipurush prabhas)

  ప్రస్తుతం కీర్తి సురేష్.. తెలుగులో మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు ‘రంగ్ దే’, ‘గుడ్ లక్ సఖి’ సినిమాలను రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే వేరే హీరోయిన్స్‌తో టెస్ట్ లుక్ చేస్తే.. కీర్తి సురేష్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయినట్టు సమాచారం.ఈ సినిమాలో మరో కథానాయికకు ఛాన్స్ ఉంది. అది మండోదరి పాత్ర. రావణాసురుడి భార్య మండోదరి క్యారెక్టర్‌కు కూడా సినిమాలో అంతే ఇంపార్టెన్స్ ఉంది.సైఫ్ జోడిగా మరో క్రేజీ హీరోయిన్నే తీసుకునే అవకాశాలున్నాయి.ఈ చిత్రంలో కృష్ణంరాజు దశరథుడి పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని  టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

  Rebel Star Prabhas good news to fans his bahubali movie re release in theatres here are the details,prabhas,Prabhas Bahubali release,bahubali 2 Re Release,prabhas twitterPrabhas adipurush shooting starts,prabhas adipurush shooting start from janaury,Prabhas as lord Rama,Prabhas kriti Sanon,Kriti Sanon as Seethaprabhas adipurush movie,adipurush prabhas kiara advani,adipurush prabhas anushka sharama,adipurush anushka sharma as seetha,anushka sharma,kiara advani,prabhas adipurush kiara advani,prabhas adipurush movie keerthy suresh,prabhas keerthy suresh,adipurush movie,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కీర్తి సురేష్,ప్రభాస్ ఆదిపురుష్‌లో కీర్తి సురేష్,ఆదిపురుష్‌లో కియారా అద్వానీ,ఆదిపురుష్‌‌లో సీతగా కియారా అద్వానీ,కియారా అద్వానీ ప్రభాస్,ప్రభాస్‌కు జోడిగా కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్ కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్‌లో అనుష్క శర్మ,అనుష్క శర్మ,ఆదిపురుష్‌లో సీత పాత్రలో అనుష్క శర్మ,రాముడిగా ప్రభాస్,సీతగా కృతి సనన్,కృతి సనన్,ప్రభాస్ కృతి సనన్,ఆదిపురుష్ ప్రభాస్ కృతి సనన్,జనవరి నుంచి ఆదిపురుష్ షూటింగ్,బాహుబలి రీ రిలీజ్,మరోసారి థియేటర్స్‌లో విడుదల కానున్న బాహుబలి సినిమా
  ప్రభాస్ (Twitter/Photo)

  ప్రస్తుతం ప్రభాస్, పూజా  హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా ఈ యేడాది జూలై 30న విడుదల కానుంది. మరోవైపు ఆదిపురుష్ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Adipurush movie, Bollywood news, Keerthy Suresh, Om Raut, Prabhas, Tollywood

  ఉత్తమ కథలు