Prabhas Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సీతగా ఈ బాలీవుడ్ భామనే ఫిక్స్ చేసారా..

Prabhas Adipurush | Prabhas Adipurush | రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్ని కూడా బాహుబలి లెవల్లోనే భారీగా ప్యాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రను కోసం ఈ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

news18-telugu
Updated: November 3, 2020, 1:27 PM IST
Prabhas Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సీతగా ఈ బాలీవుడ్ భామనే ఫిక్స్ చేసారా..
ప్రభాస్ ‘ఆదిపురుష్’(File/Photos)
  • Share this:
Prabhas Adipurush | రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్ని కూడా బాహుబలి లెవల్లోనే భారీగా ప్యాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. మొత్తం భారత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా ఇప్పుడు ప్రభాస్‌పైనే ఉంది. ఈయన కోసమే ప్రత్యేకంగా కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు. అలా చేసిన ఓ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. తానాజీ దర్శకుడు ఓం రౌత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది.అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయిన ప్రేక్షకులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే లంకేష్ అదేనండి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్టు అఫీషియ‌ల్‌గా ప్రకటించారు.

ఆదిపురుష్‌గా ప్రభాస్ (Twitter/Photo)


అంతేకాదు ఇప్పటికే ప్రభాస్.. ఈ సినిమా కోసం విలు విద్యలో  ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇందులో సీత ఎవరు అనేది హాట్ టాపిక్ అయిపోయింది. చారిత్రాత్మక నేపథ్యంలో యాక్షన్ 3డిగా వస్తున్న ఈ చిత్రంలో సీత పాత్ర కోసం జాతీయ ఉత్తమ నటి కీర్తిసురేష్ నటించబోతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కియారా అద్వానీ,అనుష్క శర్మల పేర్లు వినిపించాయి. అనుష్క ఈ సినిమా చేయడానికి ముందు ఓకే చేసినా.. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడం.. బిడ్డ పుట్టాకా..ఎంత లేదన్నా మరో ఐదారు నెలలు పట్టే అవకాశం ఉంది.

ఆదిపురుష్‌గా ప్రభాస్ (Twitter/Photo)
ప్రభాస్ ఆదిపురుష్‌లో సీతగా కృతిసనన్ (Twitter/Photo)


అందుకే ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీతగా ఎవరు నటిస్తే..  తాజాగా ఈ సినిమాలో సీత పాత్ర కోసం కృతి సనన్ పేరును ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఈ భామ తెలుగులో మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ సినిమాలో కూడా ఓ హీరోయిన్‌గా నటించినా సక్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్ వెళ్లింది. అక్కడ వరుస అవకాశాలతో పాటు సక్సెస్ కూడా అందుకుంది. ఇపుడు ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్యాన్ ఇండియా మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.


Prabhas Adipurush movie Kriti Sanon to Play seetha Maa character in adipurush here are the details,prabhas,prabhas twitter,Prabhas as lord Rama,Prabhas kriti Sanon,Kriti Sanon as Seethaprabhas adipurush movie,adipurush prabhas kiara advani,adipurush prabhas anushka sharama,adipurush anushka sharma as seetha,anushka sharma,kiara advani,prabhas adipurush kiara advani,prabhas adipurush movie keerthy suresh,prabhas keerthy suresh,adipurush movie,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కీర్తి సురేష్,ప్రభాస్ ఆదిపురుష్‌లో కీర్తి సురేష్,ఆదిపురుష్‌లో కియారా అద్వానీ,ఆదిపురుష్‌‌లో సీతగా కియారా అద్వానీ,కియారా అద్వానీ ప్రభాస్,ప్రభాస్‌కు జోడిగా కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్ కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్‌లో అనుష్క శర్మ,అనుష్క శర్మ,ఆదిపురుష్‌లో సీత పాత్రలో అనుష్క శర్మ,రాముడిగా ప్రభాస్,సీతగా కృతి సనన్,కృతి సనన్,ప్రభాస్ కృతి సనన్,ఆదిపురుష్ ప్రభాస్ కృతి సనన్
‘ఆదిపురుష్’లో సీతగా కృతి సనన్ (Twitter/Photo)


 ఈ సినిమాలో మరో కథానాయికకు ఛాన్స్ ఉంది. అది మండోదరి పాత్ర. రావణాసురుడి భార్య మండోదరి క్యారెక్టర్‌కు కూడా సినిమాలో అంతే ఇంపార్టెన్స్ ఉంది.సైఫ్ జోడిగా మరో క్రేజీ హీరోయిన్నే తీసుకునే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నట్టు సమాచారం. ఇంకోవైపు  ఈసినిమాలో లక్ష్మణుడిగా అథర్వ పేరు అనుకుంటున్నారు. వీరితో పాటు కృష్ణంరాజు దశరథుడి పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని  టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 3, 2020, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading