హోమ్ /వార్తలు /సినిమా /

‘ఆదిపురుష్’లో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ క్రేజీ భామ.. ఆమె ఫైనల్ అంటున్న చిత్ర యూనిట్..

‘ఆదిపురుష్’లో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ క్రేజీ భామ.. ఆమె ఫైనల్ అంటున్న చిత్ర యూనిట్..

ఆదిపురుష్: 
హీరో: ప్రభాస్, దర్శకుడు: ఓం రౌత్, బడ్జెట్ 350 కోట్లు

ఆదిపురుష్: హీరో: ప్రభాస్, దర్శకుడు: ఓం రౌత్, బడ్జెట్ 350 కోట్లు

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్.. నేషనల్ స్టార్ అయిపోయాడు. తాజాగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్.. నేషనల్ స్టార్ అయిపోయాడు. అంతేకాదు బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్ని కూడా బాహుబలి లెవల్లోనే భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ సినిమాలంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. హోల్ ఇండియాలో అన్ని ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా ఇప్పుడు ప్రభాస్‌పైనే ఉంది. ఈయన కోసమే ప్రత్యేకంగా కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు. అలా చేసిన ఓ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. తానాజీ దర్శకుడు ఓం రౌత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది.అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయిన ప్రేక్షకులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆదిపురుష్‌లో ప్రభాస్ జోడిగా కియారా అద్వానీ పేరు ?

అంతేకాదు ఇప్పటికే ప్రభాస్.. ఈ సినిమా కోసం విలు విద్యలో  ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇందులో సీత ఎవరు అనేది హాట్ టాపిక్ అయిపోయింది. చారిత్రాత్మక నేపథ్యంలో యాక్షన్ 3డిగా వస్తున్న ఈ చిత్రంలో సీత పాత్ర కోసం జాతీయ ఉత్తమ నటి కీర్తిసురేష్ నటించబోతుందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ సినిమాలో సీత పాత్ర కోసం కియారా అద్వానీ పేరు దాదాపు ఖాయం అయిందనే మాటలు వినిపించాయి.

ప్రభాస్ సరసన కియారా అద్వానీ (File/Photo)

అయితే.. సీత లాంటి మహాసాధ్వి పాత్రకు కియారా సెట్ అవుతుందా అని అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ అయితేనే బెటర్ అని చాలా మంది చెబుతున్నారు. కానీ అప్పట్లో బాలయ్య ‘శ్రీరామరాజ్యంలో’ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకుంటే ఇలాంటి విమర్శలే వచ్చాయి. కానీ ఫైనల్‌గా సీతగా నయనతార అద్భుత అభినయాన్ని ప్రదర్శించింది. అంతేకాదు ఆమె నటనకు అవార్డులు కూడా వరించాయి. మరి కియారా కూడా నయనతార లాగా..సీత పాత్రలో ఎలా చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ పేరుతో పాటు మోహన్ బాబు పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.  ‘ఆదిపురుష్’ సినిమా విషయానికొస్తే..  టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని  తెరకెక్కించనున్నారు.

First published:

Tags: Bollywood, Kiara advani, Prabhas

ఉత్తమ కథలు