హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas Adipurush: ‘ఆదిపురుష్’లో ప్రభాస్‌కు జోడిగా బీ టౌన్ క్రేజీ భామ..

Prabhas Adipurush: ‘ఆదిపురుష్’లో ప్రభాస్‌కు జోడిగా బీ టౌన్ క్రేజీ భామ..

ఆదిపురుష్: 
హీరో: ప్రభాస్, దర్శకుడు: ఓం రౌత్, బడ్జెట్ 350 కోట్లు

ఆదిపురుష్: హీరో: ప్రభాస్, దర్శకుడు: ఓం రౌత్, బడ్జెట్ 350 కోట్లు

Prabhas Adipurush: ప్రభాస్ కథానాయకుడిగా... ఆదిపురుష్’ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పలువురు పేర్లు వినిపించినా.. తాజాగా మరో క్రేజీ బాలీవుడ్‌ను ఈ సినిమాలో సీత పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచరాం.

ఇంకా చదవండి ...

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్ని కూడా బాహుబలి లెవల్లోనే భారీగా ప్యాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. హోల్ ఇండియాలో అన్ని ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా ఇప్పుడు ప్రభాస్‌పైనే ఉంది. ఈయన కోసమే ప్రత్యేకంగా కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు. అలా చేసిన ఓ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. తానాజీ దర్శకుడు ఓం రౌత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది.అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయిన ప్రేక్షకులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే లంకేష్ అదేనండి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్టు అఫీషియ‌ల్‌గా ప్రకటించారు.

Prabhas Adipurush shooting starts with this scenes here are the details,prabhas,prabhas twitter,prabhas adipurush movie,prabhas Adipurush saif ali khan,saif ali khan lankesh adipurush,mohan babu prabhas,prabhas mohan babu adipurush,adipurush prabhas kiara advani,kiara advani,prabhas adipurush kiara advani,prabhas adipurush movie keerthy suresh,prabhas keerthy suresh,adipurush movie,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కీర్తి సురేష్,ప్రభాస్ ఆదిపురుష్‌లో కీర్తి సురేష్,ఆదిపురుష్‌లో కియారా అద్వానీ,ఆదిపురుష్‌‌లో సీతగా కియారా అద్వానీ,కియారా అద్వానీ ప్రభాస్,ప్రభాస్‌కు జోడిగా కియారా అద్వానీ,ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్,సైఫ్ అలీ ఖాన్,ఆదిపురుష్‌లో లంకేష్‌గా సైఫ్ అలీ ఖాన్,ఆదిపురుష్‌లో మోహన్ బాబు,మోహన్ బాబు ప్రభాస్ ఆదిపురుష్
ప్రభాస్ ఆదిపురుష్‌Photo : Twitter

అంతేకాదు ఇప్పటికే ప్రభాస్.. ఈ సినిమా కోసం విలు విద్యలో  ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇందులో సీత ఎవరు అనేది హాట్ టాపిక్ అయిపోయింది. చారిత్రాత్మక నేపథ్యంలో యాక్షన్ 3డిగా వస్తున్న ఈ చిత్రంలో సీత పాత్ర కోసం జాతీయ ఉత్తమ నటి కీర్తిసురేష్ నటించబోతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కియారా అద్వానీ పేరు కూడా వినిపించింది.  జాగా ఈ సినిమాలో సీత పాత్ర కోసం అనుష్క శర్మ పేరును పరిశీలిస్తున్నారు.

ఫ్రభాస్ ఆదిపురుష్ సినిమాలో అనుష్క శర్మ (File/Photos)

అయితే.. అనుష్క శర్మ ప్రెగ్నెంట్‌గా ఉంది. ఇక ఈ  సినిమా వచ్చే యేడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక అనుష్క వర్మ కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎంత లేదన్న ఆలనా పాలనా చూడాల్సి ఉంటుంది. ఎంత లేదన్న అనుష్క శర్మ సినిమాల్లో నటించాలంటే యేడాది పైగా సమయం పట్టే అవకాశం ఉంది. మరి సీత పాత్ర కోసం అన్ని రోజులు చిత్ర యూనిట్ ఆగుతుందా. లేకపోతే అనుష్క శర్మ ప్లేస్‌లో.. కియారా లేదా కీర్తి సురేష్‌లలో ఎవరినైనా ఎంపిక చేసుకుంటారో చూడాలి. ఈ సినిమాలో మరో కథానాయికకు ఛాన్స్ ఉంది. అది మండోదరి పాత్ర. రావణాసురుడి భార్య మండోదరి క్యారెక్టర్‌కు కూడా సినిమాలో అంతే ఇంపార్టెన్స్ ఉంది.

ప్రభాస్, అనుష్క శర్మ (File/Photo)

సైఫ్ జోడిగా మరో క్రేజీ హీరోయిన్నే తీసుకునే అవకాశాలున్నాయి. ‘ఆదిపురుష్’ సినిమా విషయానికొస్తే..  టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

First published:

Tags: Adipurush movie, Anushka Sharma, Bollywood, Keerthy Suresh, Kiara advani, Prabhas, Saif Ali Khan, Tollywood

ఉత్తమ కథలు