హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో మరో స్టార్ హీరో.. ? సాక్ష్యం ఇదిగో..

Prabhas: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో మరో స్టార్ హీరో.. ? సాక్ష్యం ఇదిగో..

ప్రభాస్ ఆదిపురుష్ Photo : Twitter

ప్రభాస్ ఆదిపురుష్ Photo : Twitter

Prabhas:  ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ .. వరుస పెట్టి సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా.. వాటన్నింటినీ ఒకదాని వెంట ఇంకొకటి లైన్‌లో పెడుతున్నాడు. తాజాగా ప్రభాస్.. ’ఆదిపురుష్‌లో బాలీవుడ్ అగ్ర నటుడు నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అన్నట్టు..

ఇంకా చదవండి ...

  Prabhas:  ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ .. వరుస పెట్టి సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా.. వాటన్నింటినీ ఒకదాని వెంట ఇంకొకటి లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ కానీకొచ్చింది. ఈ సినిమా తర్వాత ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘సలార్’ మూవీ షూటింగ్ గోదావరి ఖనిలో ప్రారంభమైంది. మరోవైపు ‘ఆదిపురుష్’ సినిమా ముంబైలో పూజా కార్యక్రమాలతో  అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులు మొదలు పెట్టారు. ఆదిపురుష్‌ను బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రావ‌త్ డైరెక్ట్ చేస్తున్నాడు. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నాడు. ప్రభాస్‌తో మరో సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్ గా న‌టిస్తున్నాడు. ఇక సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోందని సమాచారం. దీనికి కొంత క్లారిటీ రావాల్సిఉంది. ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారు అన్న దానిపై మాత్రం అలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఈ చిత్రంలో ఆ రోల్‌కు బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరు వినిపించగా తాజాగా టైగర్ ష్రాఫ్ పేరు వినపడుతోంది.

  ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషించ‌నుండ‌గా, ఆయ‌న త‌ల్లి కౌసల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్ నడుస్తోంది. మరోవైపు దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటించనున్నారని తెలుస్తోంది ఈ ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది. తాజాగా నిన్నమొదలైన  ఈ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరగడంపై అందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సలార్ యూనిట్ ప్రయాణిస్తోన్న వెహికల్ పెద్దపల్లి దగ్గర ప్రమాదానికి గురైయింది.

  ప్రభాస్ ఆదిపురుష్ ముహూర్తం షాట్ (Instagram/Photo)

  ఆ సంగతి పక్కన పెడితే.. ఈ రెండు సినిమాల కోసం ప్రభాస్... నెలలో చెరో 15 రోజుల పాటు ఏప్రిల్ వరకు కేటాయించనున్నాడు. దీంతో ప్రభాస్ పార్ట్‌కు చెందిన షూటింగ్ ఫినిష్ కానుంది. మరోవైపు గ్రాఫిక్స్ ఇతర వర్క్స్ కోసం దాదాపు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అజయ్ దేవ్‌గణ్ ఈ విషయాలను ఖండించారు.

  prabhas, prabhas shooting, adipurush fire accident, salaar movie, salaar movie unit accident, tollywood news,telugu cinema news, ప్రభాస్, ఆది పురుష్, సలార్, టాలీవుడ్, ఆదిపురుష్ సెట్లో ప్రమాదం, సలార్ యూనిట్‌కు రోడ్డు ప్రమాదం
  సలార్ యూనిట్‌కు రోడ్డు ప్రమాదం.. ఆదిపురుష్‌కు అగ్నిప్రమాదం.. ఒకే రోజు

  కానీ తాజాగా నిన్న జరిగిన ‘ఆదిపురుష్’ పూజా కార్యక్రమాలకు అజయ్ దేవ్‌గణ్ హజరయ్యారు. దీంతో  ఈ సినిమాలో అజయ్ నటించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అజయ్ దేవ్‌గణ్... గతంలో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘తానాజీ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ ఫ్రెండ్ షిప్‌తో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడా అనేది తెలియాల్సి ఉంది.

  ఫ్రభాస్ ‘ఆదిపురుష్’ పూజా కార్యక్రమానికి హాజరైన అజయ్ దేవ్‌గణ్ (Instagram/Photo)

  ఈ సినిమాను భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమాను వచ్చే యేడాది 11 ఆగష్టు 2022న విడుదల చేయనున్నారు.  ఇక ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. అవతార్, స్టార్ వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Adipurush movie, Ajay Devgn, Bollywood news, Prabhas, Radhe Shyam, Tollywood

  ఉత్తమ కథలు