Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌ కోసం రంగంలోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్..

Prabhas Adipurush: బాహుబలి తర్వాత ప్రభాస్.. కేవలం ‘సాహో’ కోసం రెండేళ్లు కేటాయించాడు. అందుకే ఇపుడు చేయబోయే సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఈ సినిమా కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపుతున్నారు.

news18-telugu
Updated: September 14, 2020, 7:07 AM IST
Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌ కోసం రంగంలోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్..
ఆదిపురుష్‌లో ప్రభాస్ (Instagram/Photo)
  • Share this:
Prabhas Adipurush: బాహుబలి తర్వాత ప్రభాస్.. కేవలం ‘సాహో’ కోసం రెండేళ్లు కేటాయించాడు. అందుకే ఇపుడు చేయబోయే సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. అంతేకాదు ఇకపై గ్యాప్ రాకూడనే ఉద్దేశ్యంతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాను త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకున్న కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్ లేటయింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లనున్నాడు.  ఒకవైపు  ప్రభాస్.. ‘రాధేశ్యామ్’ సినిమాను చేస్తూనే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కు ఢీ కొట్టే లంకేషుడు అదేనండి రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ  ఖాన్ నటిస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్.. సరసన హీరోయిన్లుగా కీర్తి సురేష్, కియారా అద్వానీ, అనుష్క శర్మ  పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరినీ ఫైనల్ చేస్తారో చూడాలి.

ఫ్రభాస్ ఆదిపురుష్ సినిమాలో అనుష్క శర్మ (File/Photos)


ఆదిపురుష్‌లో  శ్రారీమచంద్రుడి తండ్రి దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.  ఈ సినిమాకు మ్యూజిక్ కోసం మరోసారి కీరవాణిని రంగంలోకి దించనున్నట్టు సమాచారం. పౌరాణిక కథాంశంతో తెరకెక్కే ఈ చిత్రానికి సంగీతం ఇవ్వాలంటే మాములు విషయం కాదు. ఇప్పటికే కీరవాణి.. అన్నమయ్య, శ్రీరామదాసు, బాహుబలి సినిమాలతో ఎటువంటి సంగీతం అందించారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే చిత్ర యూనిట్.. కీరవాణితో సంప్రదింపులు జరిపారంట. కీరవాణి మ్యూజిక్ కోసం ప్రభాస్.. రాజమౌళితో రాయబారం నడిపినట్టు సమాచారం. ప్రస్తుతం కీరవాణి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు క్రిష్, పవన్ కళ్యాణ్ వంటి క్రేజీ చిత్రాలున్నాయి. వాటితో పాటు ఇపుడు ఆదిపురుష్ కోసం కీరవాణి పనిచేయనున్నాడు. మరి ‘ఆదిపురుష్’ కోసం కీరవాణి ఎలాంటి బాణీలు సమకూరుస్తారో చూడాలి.

Prabhas Adipurush latest updates bahubali music director mm keeravani to compose songs to adipurush sources says,prabhas,Prabhas krishnam raju,Prabhas adipurush mm keeravani,Prabhas Adipurush MM keeravani music direction,mm keeravani,mm keeravani to music adipurush,krishnam raju play dasharadha,krishnam raju play dasharatha prabhas twitter,prabhas adipurush movie,adipurush prabhas kiara advani,adipurush prabhas anushka sharama,adipurush anushka sharma as seetha,anushka sharma,kiara advani,prabhas adipurush kiara advani,prabhas adipurush movie keerthy suresh,prabhas keerthy suresh,adipurush movie,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కీర్తి సురేష్,ప్రభాస్ ఆదిపురుష్‌లో కీర్తి సురేష్,ఆదిపురుష్‌లో కియారా అద్వానీ,ఆదిపురుష్‌‌లో సీతగా కియారా అద్వానీ,కియారా అద్వానీ ప్రభాస్,ప్రభాస్‌కు జోడిగా కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్ కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్‌లో అనుష్క శర్మ,అనుష్క శర్మ,ఆదిపురుష్‌లో సీత పాత్రలో అనుష్క శర్మ,కృష్ణంరాజు,ప్రభాస్ కృష్ణంరాజు,దశరథుడి పాత్రలో కృష్ణంరాజు,కీరవాణి,ఎంఎం కీరవాణి,ప్రభాస్ ఆదిపురుష్ కీరవాణి,ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు కీరవాణి సంగీతం,
ప్రభాస్ ఆదిపురుష్‌కు కీరవాణి సంగీతం (Instagram/Photo)


మరోవైపు ఈ చిత్రంలో విశ్వామిత్రుడిగా మోహన్ బాబు పేరును పరిశీలిస్తున్నారు. మిగిలిన పాత్రల కోసం ఆయా భాషల్లో ఫేమసైన నటీనటులను తీసుకునే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. రామాయణ గాథ తెరకెక్కించాలంటే ఎంతో మంది ఆర్టిస్టులు కావాలి. దీంతో ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 14, 2020, 7:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading