హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌ సెట్‌లో అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం అదేనా..

Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌ సెట్‌లో అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం అదేనా..

Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌ సెట్‌లో అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం అదేనా.. అంటే ఔననే అంటున్నారు.

Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌ సెట్‌లో అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం అదేనా.. అంటే ఔననే అంటున్నారు.

Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌ సెట్‌లో అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం అదేనా.. అంటే ఔననే అంటున్నారు.

  Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌ సెట్‌లో అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం అదేనా.. అంటే ఔననే అంటున్నారు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ నిన్న  ప్రారంభం అయ్యింది. ముంబ‌యి  ఓ ఫిల్మ్ స్టూడియోలో ఆదిపురుష్‌ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా..సాయంత్రం గం.4.15ని.ల స‌మ‌యంలో స్టూడియోలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దీనికి కారణంగా ముహూర్త బలం సరిగా లేనందనే ఇలాంటి ఘటన సంభవించిందని చెబుతున్నారు. ముహూర్త బలం పుష్య బహుళ పంచమి రోజున ఎలాంటి ముహూర్తాలు లేవు. అలాంటి  రోజున ఈ సినిమాను ప్రారంభోత్సవం చేసినందుకే ఈ సినిమాకు అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని కొంత మంది పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే మన హీరోలు ఏదైనా సినిమా ప్రారంభించే ముందు ముహూర్తాలు గట్రా చూసుకుంటారు. పైకి ఇదేదో కనబడ్డ.. కోట్లలో జరిగే వ్యవహారం కాబట్టి.. ముహూర్తాలు మిగతా విషయాలపై హీరోలకు, నిర్మాతలు, దర్శకులకు ఇలాంటి  పట్టింపులు చాలానే  ఉంటాయి.

  ప్రస్తుతం గురు మూఢమి ఉన్నందున ఎలాంటి శుభకార్యాలు చేయడానికి వీలు లేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేది నుంచి శుక్ర మూఢమి ఉంది. ఇది ఏప్రిల్ 30వ తేది వరకు ఉంది. ఇలాంటి సందర్భాల్లో మన దగ్గర ఎలాంటి శుభకార్యాలైన వివాహాది, గృహ ప్రవేశాలు, పుణ్యకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదని పండితుల వాదన. ఆదిపురుష్‌కు నిర్ణయించిన ముహూర్తం రోజున మంగళవారం కుజుడుకు సంబంధించినది కాబట్టి.. సెట్ అగ్నికి ఆహుతి అయిందని కొంత మంది లెక్కలతో సహ చెబుుతున్నారు. మరోవైపు మూవీ మేకర్స్ .. ఈ సినిమా నిర్మాణ విషయంలో మరోసారి మంచి ముహూర్తం చూసుకొని తిరిగి మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు సలార్ విషయంలో కూడా అదే జరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా ప్రభాస్ కూడా ఇపుడు సినిమాల ముహూర్తలా విషయంలో జాగ్రత్త ఉండాలని పెదనాన్న కృష్ణంరాజు సూచించినట్టు తెలుస్తోంది.

  prabhas, prabhas shooting, adipurush fire accident, salaar movie, salaar movie unit accident, tollywood news,telugu cinema news, ప్రభాస్, ఆది పురుష్, సలార్, టాలీవుడ్, ఆదిపురుష్ సెట్లో ప్రమాదం, సలార్ యూనిట్‌కు రోడ్డు ప్రమాదం
  సలార్ యూనిట్‌కు రోడ్డు ప్రమాదం.. ఆదిపురుష్‌కు అగ్నిప్రమాదం.. ఒకే రోజు


  ఆదిపురుష్ సినిమా విషయానికొస్తే..  ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషించ‌నుండ‌గా, ఆయ‌న త‌ల్లి కౌసల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్ నడుస్తోంది. మరోవైపు దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటించనున్నారని తెలుస్తోంది ఈ ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు రూ.  300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది. తాజాగా నిన్నమొదలైన  ఈ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరగడంపై అందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

  First published:

  Tags: Adipurush movie, Bollywood news, Prabhas, Salaar, Tollywood