Home /News /movies /

PRABHAS ADIPURUSH FAN MADE POSTER RELEASED ON THE OCCASION OF SRI RAMA NAVAMI SB

Adipurush: రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నాడు? ఆదిపురుష్ నుంచి అదిరిపోయే ఫోటోలు

ప్రభాస్‘ఆదిపురుష్’  Adipurush Photo : Twitter

ప్రభాస్‘ఆదిపురుష్’ Adipurush Photo : Twitter

ఈ సినిమా కోసం ప్రభాస్ మేకోవర్ అవుతున్నాడు, తన బాడీని కూడా మార్చుకుంటున్నాడు. రాముడిలా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక రాముడి పాత్రకు ప్రభాస్ కరెక్ట్‌గా ఉంటాడని డైరెక్టర్ ఓంరైత్ చెబుతున్నాడు.

    శ్రీరామ నవమి సందర్భంగా ... ప్రభాస్‌ (Prabhas) ఆదిపురుష్(Adipurush) సినిమాపై ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌. ఈ వీడియోలో అభిమానులు తయారు చేసిన అనేక రకాల పోస్టర్లను చూపించారు. రాముడిగా ప్రభాస్‌ను చూపిస్తూ.. అనేక రకాల స్టిల్స్‌ను ఇందులో చూపించారు. ఈ వీడియోకు ఓంరౌత్ ఓ కామెంట్ కూడా పెట్టారు. శ్రీరాముడికి సంబంధించిన కోట్స్‌ను ఆయన పేర్కొన్నారు.

    ‘గొప్ప శౌర్యంతో కూడిన సముద్రం,
    ప్రేమను కురిపించే అందమైన రూపం
    శ్రీరాముడి జన్మించిన వేళ
    ఊరు వాడా ఆనందంతో చేసెను నృత్యం’.
    ఇలాంటి అర్థాన్నిఇచ్చే ఓ హిందీ కవితను ఆయన తన ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.



    పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ఆదిపురుష్‌. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌(Om Routh) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ప్రభాస్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌లాంటి స్టార్‌ హీరో నటిస్తుండడం, రామాయణ ఇతిహాస ఇతివృత్తంగా తెరకెక్కుతుండడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. దర్శకుడు ఓంరౌత్‌ ఆదిపురుష్ సినిమాను భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌, తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి తాజాగా దర్శకుడు ఓంరౌత్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    ‘ఒకవేళ ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush)సినిమా చేయడానికి ఒప్పుకోక పోతే, అసలు ఆదిపురుష్‌ అనే సినిమానే తీసేవాడిని కాదన్నారు ఓంరౌత్. ఈ ప్రాజెక్టు చేయడానికి ఆ దేవుడే నన్ను ఎన్నుకున్నాడని నమ్ముతాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక రాముడి పాత్రలో ప్రభాస్‌ను ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ప్రభాస్‌ కళ్లు, ఫిజిక్‌ రాముడి పాత్రకు సరిగ్గా సరిపోతాయి. మనసులో ఉన్న భావాలను పలికించేవి కళ్లే.. ప్రభాస్‌ తన కళ్లలో కరుణ రసాన్ని చూపించగలరని నమ్మి, ఆయనే ఈ పాత్ర చేయాలనుకున్నాయి. అంతేకాకుండా రాముడిలోని పరాక్రమ వీరత్వాన్ని కూడా ప్రభాస్‌ చూపించగలని తాను నమ్మానన్నారు ఓంరౌత్.

    మరోవైపు ఆదిపురుష్(Adipurush) కోసం మేకోవర్ అవుతున్నాడు ప్రభాస్ (Prabhas). రాముడి పాత్ర కోసం శరీరాన్ని మార్చుకుంటున్నాడు. దీంతో పాటు హిందీ భాషపై కూడా పట్టు పెంచుకున్నాడు. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా కృతీసనన్‌(Kriti Sanon) నటిస్తుండగా, కీలక పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan) కూడా నటిస్తున్నాడు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Adipurush movie, Bollywood, Bollywood Movie, Prabhas

    తదుపరి వార్తలు