హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Adi Purush: ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్‌ డేట్ ఖరారు... అప్పుడే ఎందుకు?

Prabhas - Adi Purush: ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్‌ డేట్ ఖరారు... అప్పుడే ఎందుకు?

Prabhas - Adi Purush: ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆదిపురుష్’ సినిమా ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ‘ఆది పురుష్’ ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదలవుతుందో తెలుసా...

  రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఆది పురుష్‌’ ఒక‌టి. ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతోన్న చిత్ర‌మిది. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుంటే, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావ‌ణాసురుడుగా, స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణుడిగా, కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ముంబైలోని ఓ ప్రైవేటు స్టూడియోలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ప్రభాస్, కృతి, స‌న్నీసింగ్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ సినిమాను తెర‌కెక్కించే క్ర‌మంలో వ‌చ్చిన అడ్డంకుల‌ను దాటి సినిమా యూనిట్ స‌జావుగా, సైలెంట్‌గా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసే ప‌నిలో ఉంది.

  లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌కు సంబంధించిన వార్తొక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌గా ప్ర‌భాస్ లుక్‌ను శ్రీరామ న‌వమి రోజున విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 21న శ్రీరామ న‌వమి.. కాబ‌ట్టి ఆరోజున ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్‌ను చూసేయ‌వ‌చ్చు. అంటే ఓ నెల కూడా స‌మ‌యం లేదు. ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌కుడు ఓం రావుత్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. షూటింగ్ కంటే వి.ఎఫ్‌.ఎక్స్‌కు ఈ సినిమాలో ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉంటుంది. కాబట్టి ఓంరావుత్ స్టూడియోస్‌లో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసి త‌ర్వాత వి.ఎఫ్‌.ఎక్స్‌పై ఫోక‌స్ పెడ‌తాడు.

  ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 20వ చిత్రం రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణ ఓ వారం పెండింగ్ ఉంది. ఈలోపు ప్ర‌భాస్ ఒక‌వైపు స‌లార్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల‌ను పూర్తి చేయగానే.. నాగ్ అశ్విన్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనాల్సి ఉంది. ఇవి కాకుండా మ‌రో రెండు పాన్ ఇండియా సినిమాలు లైన్‌లో ఉన్నాయి ప్ర‌భాస్ కోసం. అందుక‌నే ప్ర‌భాస్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వ‌ర్క్ చేస్తున్నాడు.

  First published:

  Tags: Adipurush movie, Prabhas

  ఉత్తమ కథలు