హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas Saaho: ప్రభాస్ ‘సాహో’ సినిమాకు రెండేళ్లు.. 200 కోట్లు వసూలు చేసినా ఫ్లాప్ తప్పలేదు..

Prabhas Saaho: ప్రభాస్ ‘సాహో’ సినిమాకు రెండేళ్లు.. 200 కోట్లు వసూలు చేసినా ఫ్లాప్ తప్పలేదు..

3. సాహో: బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ట్రైలర్‌కు కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. అందుకే ఈ చిత్ర బిజినెస్‌కు రెక్కలు వచ్చాయి. మూడేళ్ళ కిందే సాహోకు 270 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ కేవలం 217 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయింది సాహో.

3. సాహో: బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ట్రైలర్‌కు కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. అందుకే ఈ చిత్ర బిజినెస్‌కు రెక్కలు వచ్చాయి. మూడేళ్ళ కిందే సాహోకు 270 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ కేవలం 217 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయింది సాహో.

Prabhas Saaho: ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్.. 300 కోట్ల నెట్.. 210 కోట్ల షేర్ వసూలు చేసింది సాహో. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30, 2019న విడుదలైంది. రెండేళ్ల సాహోను (Prabhas Saaho) గుర్తు చేసుకుంటూ.. ఈ సినిమా వసూళ్లను ఓ సారి చూద్దాం..

ఇంకా చదవండి ...

200 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తే ఇండస్ట్రీ హిట్ అంటారు. అలాంటి సినిమా ఒక్కటైనా కెరీర్‌లో ఉంటే చాలు అంటూ చాలా మంది హీరోలు తపస్సు చేస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం 200 కోట్ల సినిమా ఉండి కూడా ఫ్లాప్ ఇచ్చాడు. 217 కోట్ల షేర్ వసూలు చేసిన తర్వాత సాహో సినిమా ఫ్లాప్ అయిందని చెప్పడానికి చాలా మందికి మనసు రాదు. కానీ నిజం అదే. బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో ఆకాశమంత అంచనాలతో మాత్రమే కాదు.. బిజినెస్‌తో వచ్చింది. 275 కోట్లు వసూలు చేస్తే కానీ హిట్ అనలేని పరిస్థితుల్లో సాహో విడుదలైంది. అప్పటికి ఈ చిత్రంపై ఉన్న అంచనాలు చూస్తే ఈజీగా వసూలు చేస్తాడు అనిపించింది. అయితే సినిమాకు తొలిరోజే టాక్ తేడాగా రావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం పడింది. ప్రభాస్ ఇమేజ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. కాకపోతే హిందీలో మాత్రం సినిమా సూపర్ హిట్ కావడం గమనార్హం. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శకులు వేచి చూస్తున్నా కూడా సుజీత్ లాంటి చిన్న దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. రన్ రాజా రన్ మాత్రమే చేసిన అనుభవం ఉన్న సుజీత్‌ను నమ్మాడు. ఆయన విజన్‌ను నమ్మి ముందడుగు వేసాడు ప్రభాస్.

కాస్ట్ లీగా సినిమా చేసాడు కానీ కథ విషయంలో మాత్రం దొరికిపోయాడు ఈ కుర్రాడు. అన్ని భాషల్లో కలిపి 200 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినా కూడా ఫ్లాప్ లిస్టులోకి వెళ్లిపోయింది సాహో. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్.. 300 కోట్ల నెట్.. 210 కోట్ల షేర్ వసూలు చేసింది సాహో. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30, 2019న విడుదలైంది. రెండేళ్ల సాహోను గుర్తు చేసుకుంటూ.. ఈ సినిమా వసూళ్లను ఓ సారి చూద్దాం..

సీడెడ్: 11.90 కోట్లు

వైజాగ్: 10.10 కోట్లు

ఈస్ట్: 7.90 కోట్లు

వెస్ట్: 5.90 కోట్లు

కృష్ణా: 5.10 కోట్లు

గుంటూరు: 8.10 కోట్లు

నెల్లూరు: 4.40 కోట్లు

నైజాం: 28.10 కోట్లు

ఏపీ+నైజాం: 82.04 కోట్లు

హిందీ: 77.08 కోట్లు

కర్ణాటక: 16.00 కోట్లు

తమిళనాడు: 5.20 కోట్లు

కేరళ: 1.80 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 2.7 కోట్లు

ఇండియా: 184 కోట్లు

ఓవర్సీస్: 30 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్: 217 కోట్లు (షేర్)

సాహో సినిమాకు 276 కోట్ల థియెట్రికల్ బిజినెస్ జరిగింది. బాహుబలి 2 ఏకంగా 800 కోట్లు వసూలు చేయడంతో అన్ని భాషల్లోనూ ప్రభాస్ మార్కెట్ కొండెక్కి కూర్చుంది. దాంతో సాహో కూడా కచ్చితంగా లక్ష్యం చేరుకుంటుందని అంతా భావించారు. అయితే నెగిటివ్ టాక్ కారణంగా 210 కోట్ల దగ్గరే సినిమా ఆగిపోయింది. దాంతో సాహో సినిమా ఫ్లాప్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ. 121 కోట్లు బిజినెస్ చేసింది. కానీ వచ్చిన వసూళ్లు మాత్రం కేవలం 80 కోట్లు మాత్రమే. ఇక్కడే 40 కోట్ల నష్టాలు తీసుకొచ్చింది సాహో. అలాగే ఓవర్సీస్‌లోనూ 12 కోట్ల నష్టాలు తప్పలేదు. హిందీలో మాత్రం 65 కోట్ల బిజినెస్ చేస్తే 77 కోట్లు వసూలు చేసి 12 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. ఓవరాల్‌గా 276 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన సాహో.. 210 కోట్లు మాత్రమే వసూలు చేసి దాదాపు 66 కోట్ల నష్టాలు తీసుకొచ్చి ఫ్లాప్ అయింది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Prabhas, Prabhas saaho, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు