PRABHAS ACCEPT BOLLYWOOD CRAZY DIRECTOR PROJECT HERE ARE THE DETAILS TA
ప్రభాస్ దూకుడు మాములుగా లేదుగా.. బాలీవుడ్ క్రేజీ దర్శకుడి చిత్రంలో ’బాహుబలి’..
ప్రభాస్ Photo : Twitter
రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమాకు నెగిటిల్ టాక్ వచ్చినా.. ఓవరాల్‌గా రూ. 400 కోట్లు కొల్లగొట్టి హీరోగా ప్రభాస్ క్రేజ్ ఏమిటో అందిరికీ తెలిసేలా చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఐతే.. బాహుబలి తర్వాత రెండేళ్లు ‘సాహో’కే కేటాయించాడు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాను కూడా సాగతీస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అలనాటి కాలానికి సంబంధించిన హాస్పిటల్ సెట్‌ను రూపొందించనున్నారు. దీని కోసం రూ. 5 కోట్లను ఖర్చు పెట్టనున్నట్టు సమాచారం.
ప్రభాస్ 20 సినిమా ముహూర్తం (Twitter/Photo)
ఈ సినిమా తర్వాత యంగ్ రెబల్.. ఇప్పటి నుంచి యేడాదికి మినిమం రెండు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీకి ఓకే చెప్పాడు. త్వరలోనే ఈ చిత్రం కూడా పట్టాలెక్కనుంది. తాజాగా ప్రభాస్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికీ ఓకే చెప్పాడు. ప్రభాస్ సినిమా అంటే ప్యాన్ ఇండియా మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా వచ్చే యేడాది పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.