PRABHAS 22 TITLE ANNOUNCED HERE ARE THE DETAILS SR
Prabhas 22 : ప్రభాస్ హీరోగా మరో భారీ సినిమా.. అధికారిక ప్రకటన విడుదల..
ఆది పురుష్ పోస్టర్ Photo : Twitter
Prabhas 22 : ప్రభాస్ తన తదుపరి సినిమాను బాలీవుడ్ ప్రోడక్షన్ కంపెనీ టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ప్రకటించాడు.
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నాడు. ఇక ప్రభాస్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైనా దీపికా పదుకొనేను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తోంది. ఇలాంటీ చిత్రంలో సహజంగానే విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట. అది అలా ఉంటే ప్రభాస్ సడెన్‌గా తన తదుపరి సినిమాను బాలీవుడ్ ప్రోడక్షన్ కంపెనీ టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో మంగళవారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ప్రకటించాడు. ఈ సినిమా ఆయన సినిమాలకు కొంత భిన్నంగా ఉండనుందని ఆ పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది.
ఇంగ్లీష్ అక్షరం “ఏ” ను హైలైట్ చేస్తూ ఆది పురుష్ అంటూ విడుదల చేసిన ఆ పోస్టర్లో హనుమాన్, బాణం పట్టుకొని ఉన్న రాముడు అలాగే ఆ కింద పది తలల రావణునిలా ఉన్న మరో ఆకారం ఉంది. ప్యాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ సినిమా మొత్తం 5 భాషల్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో విడుదలకానుంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ విషయాలు తెలియాల్సి ఉంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.