Home /News /movies /

Prabhas 21: దీపిక పదుకొనేకు ప్రభాస్ కంటే భారీ పారితోషికం..?

Prabhas 21: దీపిక పదుకొనేకు ప్రభాస్ కంటే భారీ పారితోషికం..?

ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)

ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)

Prabhas Deepika Padukone: ప్రభాస్ అంటే ఇప్పుడు తెలుగు హీరో కాదు. ఈయన కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. సాహో సినిమా కూడా హిందీలో మంచి వసూళ్లే..

ప్రభాస్ అంటే ఇప్పుడు తెలుగు హీరో కాదు. ఈయన కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. సాహో సినిమా కూడా హిందీలో మంచి వసూళ్లే తీసుకురావడంతో ఈయనపై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కూడా ఆసక్తి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈయన రాధాకృష్ణ కుమార్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాల్లో ముందు రాధా సినిమాను పూర్తి చేయనున్నాడు ప్రభాస్. ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. కరోనా నియంత్రణ తర్వాత తిరిగి షూటింగ్ మొదలు కానుంది.

ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)


ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అలియా భట్ పేరు వినిపించినా కూడా ఇప్పుడు దీపిక పేరు ఫైనల్ అయిపోయింది. ఈ సినిమా కోసం ప్రభాస్ కంటే భారీ పారితోషికం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. ఆ కండీషన్‌పైనే ఈ సినిమా ఒప్పుకుందని తెలుస్తుంది. ఈ మధ్యే తన ఇన్‌స్టా పేజీలో మహానటి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది దీపిక. అంతా ఆ సినిమాను చూడాలంటూ తన అభిమానులను కూడా కోరింది. కారణం లేకుండా సౌత్ సినిమా పొగడాల్సిన అవసరం దీపికకు లేదు.. ఆ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్‌తోనే ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు.

ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)


ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికను అడగటంతోనే మహానటి ఆమె చూసి వర్క్ నచ్చి అతడితో పని చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఎలాగూ సినిమా నచ్చింది కాబట్టి ప్రమోట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అతీత శక్తులున్న వాడిగా ప్రభాస్ నటించబోతున్నాడు. దేవకన్యకు, మానవుడికి పుట్టిన బిడ్డగా ప్రభాస్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. చూస్తుంటే జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్‌లా అనిపిస్తుంది కదా.. అందరికీ ఇదే అనుమానం. అయితే ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ మాత్రం రాలేదు.
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)
ప్రభాస్ సినిమాలో దీపిక పదుకొనే (prabhas deepika padukone)

ఇన్ని రోజులు క్లారిటీ లేదు కానీ ఇప్పుడు మాత్రం కన్ఫర్మేషన్ వచ్చింది. దీపిక పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు చేయని దీపిక.. తొలిసారి ప్రభాస్ కోసం టాలీవుడ్‌కు వస్తుంది. బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్లకు పైగానే తీసుకునే దీపిక తెలుగులో మాత్రం దానికి మూడు రెట్లు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. తన సినిమాకు నేషనల్ వైడ్ పాపులారిటీ రావాలనే ఉద్ధేశ్యంతోనే దీపికను ఈ సినిమాలోకి తీసుకుంటున్నాడు నాగ్ అశ్విన్. మొత్తానికి దీపిక ఎంట్రీతో ప్రభాస్ సినిమా రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Deepika Padukone, Prabhas 21, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు