#Prabhas20 : ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ఫస్ట్‌లుక్‌కు మూహుర్తం ఫిక్స్..

#Prabhas20 : ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 8, 2020, 11:36 AM IST
#Prabhas20 : ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ఫస్ట్‌లుక్‌కు మూహుర్తం ఫిక్స్..
ప్రభాస్ Photo : Twitter
  • Share this:
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే చేస్తోంది. దాదాపు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా కొత్త అప్ డేట్‌తో వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈనెల 10న పది గంటలకు విడుదల చేయనున్నామని తెలిపింది చిత్రబృందం. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కిస్తుండగా.. పిరియాడిక్ జానర్‌లో ఉండనుందని సమాచారం. ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్తా అయోమయంలో ఉన్నారు అభిమానులు. మొన్నటి వరకు జాన్ అంటూ ప్రచారం అవ్వగా.. ఇప్పుడు రాధే శ్యామ్ అంటున్నారు. దీనిపై క్లారిటీ ఈ నెల పదోతారిఖున రానుంది. ఇక ఈ సినిమాలో వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజ హెగ్డే పాత్ర ఏమై ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. వస్తోన్న సమాచారం మేరకు ఆమె మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. ఈ సినిమా కథ చాలా కాలం క్రితం జరుగుతుంది గనుక, అప్పటికి సంబంధించిన ఓల్డ్ లుక్ తోనే పూజ కనిపించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ అంతేకాదు ఈ సినిమాలో పూజా చాలా కొత్తగా కనబడుతూ.. ఇంతవరకూ పూజ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది.

 



ఇక సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చందమామ కథలాంటి కథతో ఈ సినిమా సిద్ధం కాబోతుందట. ఈ ఏడాది చివర్లో సినిమా లాంచ్ చేసి వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
Published by: Suresh Rachamalla
First published: July 8, 2020, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading