Home /News /movies /

ప్రభాస్ మరో సంచలనం.. నాగ్ అశ్విన్ చిత్రం కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్..

ప్రభాస్ మరో సంచలనం.. నాగ్ అశ్విన్ చిత్రం కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్..

నాగ్ అశ్విన్: 8 కోట్లు (మహానటి తర్వాత ఈ దర్శకుడి రేంజ్ అమాంతం పెరిగింది..)

నాగ్ అశ్విన్: 8 కోట్లు (మహానటి తర్వాత ఈ దర్శకుడి రేంజ్ అమాంతం పెరిగింది..)

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్ నేషనల్ వైడ్‌గా మారింది. ఈ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా మారాడు. తాజాగా ప్రభాస్.. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్ నేషనల్ వైడ్‌గా మారింది. ఈ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఈ సినిమాతో ప్రభాస్‌కు ఇండియా వైడ్‌గా మార్కెట్ ఏర్పడింది. బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైంది. ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నఓవరాల్‌గా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం రూ.200 కోట్ల భారీ వసూళ్లను సాధించి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూర్తి లవ్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పెద నాన్న కృష్ణంరాజు కీ రోల్ పోషిస్తున్నాడు.

ప్రభాస్,నాగ్ అశ్విన్ (Twitter/Photo)


రాధాకృష్ణ సినిమా తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా కాకుండా ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఈ సినిమా కోసం ప్రభాస్.. ఏకంగా రూ.70 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది. ఒక యేడాదిలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని షరతు విధించాడట. మొత్తంగా ఈ సినిమా కోసం ప్రభాస్ రూ.100 కోట్ల వరక పారితోషకం అందుకోబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్నిటికీ సిద్ధపడే నాగ్ అశ్విన్ రంగంలోకి దిగుతున్నాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. మొత్తానికి
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Ashwini Dutt, Nag Ashwin, Prabhas, Prabhas 21, Radha Krishna, Telugu Cinema, Tollywood, Vyjayanthi Movies

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు