హోమ్ /వార్తలు /సినిమా /

ప్రభాస్‌ సినిమాకు అంతా రెడీ చేసిన నాగ్ అశ్విన్.. డిసెంబర్‌లో షూట్..

ప్రభాస్‌ సినిమాకు అంతా రెడీ చేసిన నాగ్ అశ్విన్.. డిసెంబర్‌లో షూట్..

ప్రభాస్, నాగ్ అశ్విన్ Photo : Twitter

ప్రభాస్, నాగ్ అశ్విన్ Photo : Twitter

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నాడు. ఇప్పటికే కొంతమందితో ఫోన్ లోనే సంప్రదించినట్లు సమాచారం. ఇక ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ముగ్గురును ఫైనల్ చేశాడట నాగ్ అశ్విన్. ఆ ముగ్గురులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఖరారైందని.. లాక్ డౌన్ తరువాత ఫైనల్‌గా ఓ ప్రకటన చేయనున్నారని సామాచారం. కియారా ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేసింది.

ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోంది. ఇలాంటీ చిత్రంలో సహజంగానే విఎఫ్‌ఎక్స్‌ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్‌ఎక్స్ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట. కాగా తాజా అప్ డేట్ ఏమిటంటే, నాగ్ అశ్విన్ ఈ సినిమాకి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసాడట. అంతేకాదు ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడట. అవి పూర్తైతే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ వరకు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు.

First published:

Tags: Kiara advani, Nag Ashwin, Prabhas, Tollywood

ఉత్తమ కథలు