ప్రస్తుతం మన దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా అందిరినీ కరోనా మహామ్మారి భయపెడుతోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఓసారి 21 రోజుల పాటులాక్డౌన్ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని19 రోజులు పొడిగిస్తూ.. వచ్చే నెల 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ప్రజలు కొన్నాళ్లు నిర్భందంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నాళ్లు ఇంట్లో నిర్భంధాన్ని భరించలేకపోతున్న మనం జీవితాంతం బోనుల్లో ఉంటోన్న వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించి ఒకింత భావోద్వేగానికి లోనైంది శ్రద్ధా కపూర్. ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ బుధవారం జూలో జంతువుల ఫోటోలను షేర్ చేస్తూ.. మీరంతా ఇన్నాళ్లు నిర్భంధంలో ఉండి విసిగిపోయాారా అని ఒకింత ఆవేదన వ్యక్తం చేసింది.
కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని క్వారంటైన్లో ఉండేలా చేసింది. ఇపుడు స్వీయ నిర్భంధంలో ఉండటం వల్ల ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో మనకు అర్ధమవుతుంది. మనతో పాటు జంతువులకు కూడా ఒంటరితనం, మానసిక ఒత్తిడి, బాధ జంతువులకు కూడా ఉంటాయని పేర్కొంది.తనదాక వస్తే కానీ అన్నట్టు ఇతరుల పరిస్థితి మనకు వస్తే కానీ వేరే వాళ్ల పరిస్థితి మనకు అర్ధం కాన్నట్టు ఇపుడు జంతువులు బాధ ఎలాంటిదో మనుషులమైన మనకు తెలిసొస్తుంది అంటూ పేర్కొంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం ఈ భూమి మీద మనతో పాటు మిగిలిన ప్రాణులను బతకనిద్దాం అంటూ పిలుపునిచ్చింది. లక్షల సంఖ్యలో ఉన్న ప్రాణులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాయి. ఏ జీవి కూడా బోనులో ఉండకూడదంటూ చెప్పుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Prabhas, Shraddha Kapoor, Tollywood