news18-telugu
Updated: December 24, 2020, 7:47 PM IST
పవన్ కల్యాణ్
Pawan Kalyan Vakeel Saab: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్లో పవన్ కల్యాణ్ తిరిగి పాల్గొన్నారు. ఇక ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లో ఈ చిత్ర చిత్రీకరణ జరుగుతుండగా.. షూటింగ్ బ్రేక్‌లో అక్కడి గిరిజనులతో ముచ్చటించారు పవన్. ఈ సందర్భంగా ఆదివాసీలు వారి జీవన స్థితిగతులను వివరిస్తూ ఓ పాటను పాడారు. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు పవన్.
నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట . ఇది వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది అని పవన్ ట్వీట్ చేశారు.
అలాగే జనసేన పోరాట యాత్రలో భాగంగా ' అరకు పర్యటన లో ఆదివాసీల జీవన పరిస్థితులు బాధ కలిగించినాయి. ఆదివాసీల సంస్కృతి పరిరక్షింపబడాలి , వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావటానికి జనసేన - జనసైనికులు నిరంతరం వారికీ అండగా ఉంటాం అని మరో ట్వీట్లో వెల్లడించారు పవన్ కల్యాణ్.
కాగా హిందీలో మంచి విజయం సాధించిన పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. ఇందులో మొదటిసారిగా పవన్ లాయర్ పాత్రలో కనిపించనుండగా.. ఆయన సరసన శ్రుతీ హాసన్ మూడోసారి జతకట్టబోతోంది. అంజలి, నివేథా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, మోషన్ టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై పవన్ కల్యాణ్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కరోనా రాకపోయి ఉంటే ఈ ఏడాది మేలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఇక తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్లో వకీల్ సాబ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Published by:
Manjula S
First published:
December 24, 2020, 11:45 AM IST