Power Star: పవర్ స్టార్ పవన్ సింగ్ పై రాళ్లదాడి జరిగిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భోజ్‌పురి హీరో కమ్ సింగర్ పవర్ స్టార్ పవన్ సింగ్ భోజ్‌పురి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన యూపీలోని బల్లియా జిల్లా , నాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. అక్కడ ఓ లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఈయన ఇలా పాట అందుకున్నాడో లేదో అక్కడ జనాల్లో నుంచి ఓ రాయి బలంగా వచ్చి పవర్ స్టార్ ముఖంపై పడింది. ఆ తర్వాత జనాలు వరుసగా లైవ్ ప్రోగ్రామ్ పై రాళ్ల దాడి చేసారు. దీంతో ఈవెంట్ మేనజర్ అక్కడ ప్రోగ్రామ్‌ను కాన్సిల్ చేశారు. అయితే హోళి సందర్భంగా యూపీలో కొంత మంది మద్యం తాగిన యువకులు తాము కోరిన పాటను పవన్ సింగ్ పాడలేదన్న కోపంతో అతనిపై రాళ్ల దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై హీరో కమ్ సింగర్ పవన్ సింగ్ సీరియస్ అయ్యారు. గుంపులో ఉండి రాళ్లు విసరడం కాదు.. దమ్ముంటే నా ముందుకు వచ్చిన నాపై రాళ్లు విసరండి అంటూ సవాల్ విసిరాడు.
నా కంటూ ఓ విరోధి ఉంటే ముందుకు వచ్చి ఎటాక్ చేయాలంటూ పిలుపు నిచ్చాడు. సదరు హీరోకు దెబ్బ తగలడంతో షో క్యాన్సిల్ కావడంతో ఎంతో ఆశతో తమ అభిమాన హీరో కమ్ గాయకుడు షో చూసేందుకు వచ్చిన వేలాది మంది ఉసూరు మంటూ వెళ్లిపోయారు.
पवन सिंह के लाइव शो में चला पत्थर#pawansingh #pawansinghbaliashow pic.twitter.com/TQSj6cO6bx
— Ravi Kant Mishra (@ravimishravats) March 7, 2023
రాయి ముఖానికి బలంగా తగలడంతో హీరో గారికి పెద్ద గాయమైంది. అయినా.. ప్రస్తుతం హీరో పనన్ పరిస్థితి నార్మల్‌గా ఉందని ఆయన సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. సదురు హీరోపై దాడికి సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన భోజ్‌పురి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక తమ అభిమాన హీరోపై దాడికి పాల్పడ్డ వారిని ఒదిలే ప్రసక్తే లేదంటూ ఆయన అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏది ఏమైనా యూపీలో జరిగిన ఈ ఘటన ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhojpuri Movies, Bollywood, Tollywood