Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: February 10, 2019, 4:39 PM IST
పునీత్ రాజ్ కుమార్ యశ్
పవర్ స్టార్ ఏంటి.. కేజియఫ్ సినిమా ముందు ఓడిపోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడ పవర్ స్టార్ అంటే మన పవన్ కళ్యాణ్ కాదు.. కన్నడ నాట కూడా ఓ పవర్ స్టార్ ఉన్నాడు. అక్కడ ఆయనంటే చచ్చిపోతారు. అతడే వన్ అండ్ ఓన్లీ పునీత్ రాజ్ కుమార్. ఆయన సినిమా వచ్చిందంటే హిట్ అనే మాట తప్ప మరోటి వినిపించదు కన్నడ ఇండస్ట్రీలో. ఇప్పుడు కూడా ఈయన నటించిన నట సార్వభౌమ విడుదలైంది. ఫిబ్రవరి 7న వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.

పునీత్ రాజ్ కుమార్ యశ్
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రచితా రామ్ హీరోయిన్స్‌గా నటించారు. పోటుగాడు ఫేమ్ పవన్ వడయార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా భారీ స్థాయిలో విడుదలైంది నట సార్వభౌమ. ఈ సినిమా తొలిరోజే కర్ణాటకలో ఏకంగా 7.86 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు కన్నడలో ఇంత భారీగా వసూలు చేసింది ఒక్క కేజియఫ్ సినిమా మాత్రమే. యశ్ నటించిన ఈ చిత్రం దాదాపు 10 కోట్లకు పైగా వసూలు చేసింది.

పునీత్ రాజ్ కుమార్ యశ్
ఆ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నట సార్వభౌమ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇప్పటికే నాలుగు రోజుల్లో సినిమా దాదాపు 20 కోట్లు వసూలు చేసింది. కేజియఫ్ తర్వాత ఆ స్థాయిలో రప్ఫాడిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. నట సార్వభౌమను చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు. మరి ఫుల్ రన్ లో కేజియఫ్ ను పవర్ స్టార్ దాటేస్తాడో లేదో చూడాలి.
First published:
February 10, 2019, 4:39 PM IST