హోమ్ /వార్తలు /సినిమా /

పవన్ కళ్యాణ్ ఉమెన్స్ డే గిఫ్ట్.. వకీల్ సాబ్ ప్రోమో సాంగ్ విడుదల..

పవన్ కళ్యాణ్ ఉమెన్స్ డే గిఫ్ట్.. వకీల్ సాబ్ ప్రోమో సాంగ్ విడుదల..

వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)c

వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)c

Pawan Kalyan Vakeel Saab: పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఈయన పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఈయన పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలోంచి ఓ పాటను విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. మార్చ్ 8న ఉమెన్స్ డే సందర్భంగా ఇందులో మగువ మగువ పాటను విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన ప్రోమో సాంగ్ విడుదలైందిప్పుడు. లేటెస్ట్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ ఈ పాట పాడాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పవన్ అభిమానులు అయితే ఆ ఒక్క లైన్ విని పండగ చేసుకుంటున్నారు.

మగువ మగువ.. ఈ లోకానికి తెలుసా నీ విలువా అంటూ సాగే ఈ పాట కచ్చితంగా వైరల్ అయ్యేలా కనిపిస్తుంది. మే 15న వకీల్ సాబ్ విడుదల కానుంది. శ్రీరామ్ వేణు దర్శకుడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. తమిళ, హిందీల్లో సంచలన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా కచ్చితంగా సంచలనాలు రేపుతుందని నమ్ముతున్నారు అభిమానులు. మొత్తానికి ఉమెన్స్ డేకు గట్టి గిఫ్ట్ సిద్ధం చేస్తున్నాడు పవర్ స్టార్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Pawan kalyan, Telugu Cinema, Tollywood, Vakeel Saab, Womens Day 2020

ఉత్తమ కథలు