Home /News /movies /

POWER STAR PAWAN KALYAN VAKEEL SAAB 10 DAYS WORLD WIDE COLLECTIONS TA

Vakeel Saab 10 Days Collections: వకీల్ సాబ్’ 10 డేస్ కలెక్షన్స్.. కోవిడ్ దెబ్బకు పడిపోయిన వసూళ్లు..

‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

Pawan Kalyan Vakeel Saab 10 Days Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన 10 రోజుల కలెక్షన్స్ బయటకు వచ్చాయి.

ఇంకా చదవండి ...
    Pawan Kalyan Vakeel Saab 10 Days Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఆటోమేటిక్‌గా ఈ  చిత్రంపై అంచనాలు ఆంబారాన్ని అంటాయి. అలాగే విడుదలైన తొలి నాలుగైదు రోజులు కలెెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే 6వ రోజు నుంచి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కాసేపు అలా మెరిసింది.  పింక్ సినిమా రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తమిళంలో నేర్కొండ పార్వైగా రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోనూ పింక్ కథ సత్తా చూపిస్తుంది.

    పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సినిమా కథను మార్చేసాడు వేణు శ్రీరామ్. ఇది కూడా చాలా వరకు సక్సెస్ అయింది. సినిమాలో జనసేనకు ప్రచారం కూడా బాగానే చేసారు. ఫస్టాఫ్ యావరేజ్‌గానే ఉన్నా కూడా సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది.

    ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో శ్రీరామ్ వేణు, అనన్య, అంజలి, నివేదా థామస్ (Twitter/Photo)


    స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగా రాసుకున్నాడు శ్రీరామ్ వేణు. మాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ ఊహించినంత రాకపోవడానికి కారణం ఏపీలో టికెట్ రేట్స్ తగ్గడంతో పాటు కరోనా కూడా ఉండటం. ఈ సినిమా 10 డేస్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమా ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..

    వకీల్ సాబ్ 10 రోజుల కలెక్షన్స్..

    నైజాం (తెలంగాణ)- 23.65 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ)- 12.45కోట్లు
    ఉత్తరాంధ్ర- 11.35 కోట్లు
    ఈస్ట్ గోదావరి- 5.98 కోట్లు
    వెస్ట్ గోదావరి- 6.95 కోట్లు
    గుంటూరు- 6.90 కోట్లు
    కృష్ణా- 4.77 కోట్లు
    నెల్లూరు- 3.23 కోట్లు

    ఏపీ + తెలంగాణ (టోటల్)- 75.28 కోట్లు
    రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.55 కోట్లు
    ఓవర్సీస్- 3.79 కోట్లు
    వరల్డ్ వైడ్ (టోటల్)- 82.62 కోట్లు షేర్

    ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు (Twitter/Photo)


    ఈ సినిమా రూ. 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 90 కోట్లు షేర్ వసూలు చేస్తే హిట్ అనిపించుకుంటుంది. 10 రోజుల్లో 82.62 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే ఇంకా రూ. 8 కోట్ల దూరంలో ఉన్నాడు వకీల్ సాబ్. అయితే టికెట్ రేట్స్.. కరోనా ఈ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మొత్తంగా ఫుల్ రన్‌లో  వకీల్ సాబ్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా వెయిట్ అండ్ సీ.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Pawan kalyan, Tollywood, Tollywood Box Office Report, Vakeel Saab, Vakeel Saab Movie Review

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు