వరుస సినిమాలతో ట్రీట్ ఇచ్చేందుకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఐదు చిత్రాలకు ఓకే చెప్పిన పవన్.. అందులో వకీల్ సాబ్ షూటింగ్‌ని ఇటీవల పూర్తి చేశారు. పింక్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఇప్పడు పవన్ మిగిలిన చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీలో పవన్ నటిస్తున్నారు
Pawan Kalyan- Krish movie: వరుస సినిమాలతో ట్రీట్ ఇచ్చేందుకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఐదు చిత్రాలకు ఓకే చెప్పిన పవన్.. అందులో వకీల్ సాబ్ షూటింగ్‌ని ఇటీవల పూర్తి చేశారు. పింక్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఇప్పడు పవన్ మిగిలిన చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీలో పవన్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ గురువారంతో ముగియనుంది. ఇందులో భాగంగా కొన్ని సన్నివేశాలతో పాటు రెండు పాటలను క్రిష్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ తరువాత పవన్, క్రిష్ మూవీకి మరోసారి బ్రేక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే పవన్- క్రిష్ మూవీ పలు బ్రేక్‌లు రాగా.. తాజాగా పవర్‌స్టార్ మరోసారి బ్రేక్ ఇవ్వనున్నారట.
దాదాపు20 రోజుల పాటు పవన్, క్రిష్ మూవీకి బ్రేక్ ఇవ్వనున్నారట. ఆ తరువాత వచ్చే నెలలో క్రిష్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నారట పవర్‌స్టార్. ఇక ఈ మధ్యలో 15 రోజలు పాటు పవన్ కల్యాణ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో నటించనున్నారట. ఒకే షెడ్యూల్లోనూ ఈ షూటింగ్‌ని పూర్తి చేయాలనుకున్న పవన్... అందుకు 15 రోజుల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. కాగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో పవన్‌తో పాటు రానా తొలిసారిగా కలిసి నటిస్తున్నాడు. రానాకు మిగిలిన ప్రాజెక్ట్‌లు ఉండటంతో.. అతడికి ఇబ్బంది కలిగించకుండా ఈ షూటింగ్‌ని పవన్ త్వరగా పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. త్రివిక్రమ్ కూడా ఈ రీమేక్‌లో భాగం అవ్వగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తరువాత పవన్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనంతరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నారు పవర్‌స్టార్.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.