పవన్ కళ్యాణ్ ఎలాగూ ఇప్పుడు వరస సినిమాలు చేయాలని ఫిక్సైపోయాడు. అందుకే ఆయన కమిట్మెంట్స్ ఇస్తున్నాడు. ఇప్పుడంటే కరోనా సమయం కాబట్టి కామ్‌గా ఉన్నాడు కానీ లేదంటే ఈ పాటికి ఓ సినిమా విడుదల చేసి.. మరోటి రెడీ చేసేవాడు పవన్ కళ్యాణ్. అంత బిజీగా ఉన్నాడు ఈయన. కానీ ఏం చేస్తాం కరోనా వచ్చి అంతా ఖరాబ్ చేసింది. వకీల్ సాబ్, క్రిష్ సినిమాలు రెండూ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. మరోవైపు హరీష్ శంకర్ కూడా పవన్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ (Twitter/Pawan Kalyan Harish Shankar)
ఈ క్రమంలోనే మరో రెండు సినిమాలకు కూడా పవన్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కుర్ర దర్శకులతో పాటు ఫ్లాప్ డైరెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్న పవర్ స్టార్.. ఓ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్లే త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ. అజ్ఞాతవాసి తర్వాత పవన్‌తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ఆసక్తి చూపిస్తున్నాడు. కచ్చితంగా ఆ ఫ్లాప్ లెక్క భర్తీ చేయాలని చూస్తున్నాడు మాటల మాంత్రికుడు. మరోవైపు కొరటాల శివ సైతం పవన్ కోసం అదిరిపోయే కథ ఒకటి సిద్ధం చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కొరటాల శివ (pawan kalyan koratala siva)
ప్రస్తుతం ఈయన చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత పవన్‌తో సినిమా చేయాలని చూస్తున్నాడు ఈయన. కొరటాల చేస్తానంటే పవన్ కూడా నో చెప్పే ఆస్కారమే ఉండదు. ఎందుకంటే ఆయన ఆలోచనలకు తగ్గట్లుగానే కొరటాల కూడా పూర్తిగా సందేశాత్మక కథ సిద్ధం చేస్తాడు కాబట్టి. సోషల్ మీడియాలో అయితే ఈ కాంబినేషన్ గురించి వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇది వర్కవుట్ అయితే అంతకంటే ఫ్యాన్స్ కోరుకునేది కూడా ఏముండదేమో..?
Published by:Praveen Kumar Vadla
First published:July 26, 2020, 22:03 IST