pawan kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని ప్రేక్షకులే లేరు. ఇక ఈయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం వరుస సినిమాలతో ఉన్న పవన్ కళ్యాణ్.. ఇటీవలే విడుదలైన వకీల్ సాబ్ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో సినిమా షూటింగులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు టీనేజ్ లో ఒక కోరిక ఉండేదట. కానీ దానికి చిరంజీవి ఏం చేసాడో తెలుసా..
మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్ననాటి ప్రాణస్నేహితుడు డాక్టర్ సత్య ప్రసాద్. ఇప్పటికీ వీరి స్నేహం అలాగే ఉండగా.. పాఠశాల రోజుల నుంచి కాలేజీ వరకు వీరు కలిసి చదువుకున్నారట. ఇక చిరంజీవి యాక్టర్ గా, సత్య ప్రసాద్ డాక్టర్ గా సెటిల్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డాక్టర్ సత్య ప్రసాద్ చిరంజీవి గురించి, తన కుటుంబం గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ టీనేజ్ లో ఉన్నప్పుడు అతనిని అన్నయ్య అంటూ.. వదిలేవాడు కాదని తెలిపాడు సత్యప్రసాద్. ఆ తరువాత వయసులోకి వచ్చాక కాస్త బిడియం మొదలైందని, సిగ్గుపడుతూ మాట్లాడేవాడని తెలిపాడు సత్య ప్రసాద్. అయితే ఒకానొక సందర్భంలో మద్రాసులో వరదలు వచ్చి మునిగిపోయిన సమయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్, సురేఖను, అతనిని తీసుకుని కారులో చుట్టాలింటికి బయలుదేరిన సమయంలో.. మధ్యలో స్లమ్ ఏరియాలో తీసుకెళ్లి వాళ్లని చూడు తాగడానికి నీళ్లు కూడా లేవు.. నువ్వేమో పొద్దున్నే బిర్యానీ కావాలని పేచీ పెట్టావంట అని పవన్ కళ్యాణ్ తో ప్రాక్టికల్ గా చూపించాడట చిరంజీవి. ఆ మాటలతో పవన్ కళ్యాణ్ లో మార్పులు రావడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని సర్వీసులు, డొనేషన్ లు చేస్తున్నారని తెలిపాడు సత్య ప్రసాద్.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.