HOME »NEWS »MOVIE »power star pawan kalyan special thanks to media friends and well wishers pk

Pawan Kalyan: మీడియా మిత్రులకు పవన్ కళ్యాణ్ స్పెషల్ థ్యాంక్స్..

Pawan Kalyan: మీడియా మిత్రులకు పవన్ కళ్యాణ్ స్పెషల్ థ్యాంక్స్..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌లో కనిపించని మార్పు చాలానే వచ్చింది. ఇదివరకు ఈయన పుట్టిన రోజు వస్తే విష్ చేసినా కూడా చూసి చూడనట్లు ఉండేవాడు.

  • Share this:
పవన్ కళ్యాణ్‌లో కనిపించని మార్పు చాలానే వచ్చింది. ఇదివరకు ఈయన పుట్టిన రోజు వస్తే విష్ చేసినా కూడా చూసి చూడనట్లు ఉండేవాడు. అలాగని వాళ్ల విషెస్ పట్టించుకోడని కాదు.. అసలు బర్త్ డేను ఆయన పట్టించుకోడని అర్థం. కానీ ఈ సారి మాత్రం ఎందుకో పవన్‌లో చాలా మార్పు కనిపించింది. తన పుట్టిన రోజుకు విష్ చేసిన ప్రతీ ఒక్కరికి పర్సనల్‌గా థ్యాంక్స్ చెప్పాడు పవర్ స్టార్. అందులో ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

సంపూర్ణేష్, యాంకర్ ప్రదీప్, కార్తికేయ లాంటి చిన్న చిన్న వాళ్ల నుంచి చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్స్ వరకు అందరికీ పేరు పేరునా గారు అంటూ సంబోధిస్తూ థ్యాంక్స్ చెప్పాడు పవన్. ఇప్పుడు మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్ చెప్పాడు పవన్. తన పుట్టిన రోజు నాడు ప్రత్యేకంగా స్టోరీస్.. స్పెషల్స్.. తన సినిమా ప్రయాణంపై ఆర్టికల్స్ రాసిన ప్రతీ ఒక్క జర్నలిస్ట్‌కు.. సినిమా జర్నలిస్టులకు.. రిపోర్టర్స్‌కు.. ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.


జర్నలిస్టులకు పవన్ కళ్యాణ్ లేఖ

తన పుట్టిన రోజు నాడు మరోసారి తన జీవితాన్ని మొత్తం గుర్తు చేసారని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అలా గుర్తు చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు అంటూ లేఖ విడుదల చేసాడు జనసేనాని. ప్రస్తుతం తాను ప్రజల మధ్యలో ఉన్నానని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. సన్నిహితులకు, మీడియా మిత్రులకు మరోసారి మనసారా థ్యాంక్స్ చెప్పాడు పవర్ స్టార్.
Published by:Praveen Kumar Vadla
First published:September 04, 2020, 20:35 IST

टॉप स्टोरीज