• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • POWER STAR PAWAN KALYAN SON AKIRA NANDAN DEBUT MOVIE WILL PRODUCED BY BANDLA GANESH NOT RAM CHARAN SOURCES SAYS PK

Akira Nandan: అకీరా నందన్ తొలి సినిమా నిర్మాత రామ్ చరణ్ కాదా.. పవన్ అతడికి ఛాన్సిచ్చాడా..?

కేరాఫ్ పవన్ కళ్యాణ్ అనే ఒక్క ఇమేజ్ చాలు స్టార్ అయిపోవడానికి. అకీరా నందన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

Akira Nandan: అకీరా నందన్(Akira Nandan).. ఒక్క సినిమా కూడా చేయకపోయినా కూడా పవన్ వారసుడు అనే ఒకేఒక్క క్రేజ్‌తో ఈయన పేరు మార్మోగిపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపించినా కూడా రచ్చ చేస్తుంటారు పవన్ ఫ్యాన్స్. తాజాగా ఈయన డెబ్యూ సినిమాపై చర్చ మొదలైంది.

  • Share this:
అకీరా నందన్.. ఒక్క సినిమా కూడా చేయకపోయినా కూడా పవన్ వారసుడు అనే ఒకేఒక్క క్రేజ్‌తో ఈయన పేరు మార్మోగిపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపించినా కూడా రచ్చ చేస్తుంటారు పవన్ ఫ్యాన్స్. మొన్న ఎప్రిల్ 8న అకీరా బర్త్ డే రోజు అయితే ఏకంగా నేషనల్ వైడ్ ట్రెండ్ చేసారు అభిమానులు. ఇదే సమయంలో ఈయన ఎంట్రీపై కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ వరసగా సినిమాలు చేస్తున్నాడు.. అలాగే రాజకీయాలు కూడా చేస్తున్నాడు. దాంతో ఎప్పుడు సినిమాలు మానేస్తాడో చెప్పడం కూడా కష్టమే. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్ సినిమాలు రావడం లేదనే బాధ వాళ్లలో కనిపిస్తుంది. ఎంత మంది హీరోలొచ్చినా పవన్ సినిమా వచ్చినపుడు ఉండే పండగ వేరు. పవర్ స్టార్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్టైనా.. ఫ్లాప్ అయినా కూడా అభిమానులు మాత్రం అలా వేచి చూస్తుంటారు. ఇప్పుడు ఈయన సినిమాలతో బిజీగా ఉన్నాడు.. దాంతో పాటు తనయుడిని సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

పవన్ కొడుకు అకిరా నందన్ సినిమాల్లోకి రాబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే 6.4 హైట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు జూనియర్ పవర్ స్టార్. తాజాగా బయటికి వచ్చిన అకీరా ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను కూడా మించిపోయాడు అకీరా.
రామ్ చరణ్ అకిరా నందన్ (ram charan akira nandan)
రామ్ చరణ్ అకిరా నందన్ (ram charan akira nandan)

వరుణ్ తేజ్ హైట్ కూడా అకీరా ముందు పనికొచ్చేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఈయన తొలి సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అకిరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. దీన్ని తెలుగులో అనువదించాలని చూస్తున్నారు. దాంతో పాటు పవన్ వారసున్ని నేరుగానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై వివరాలు బయటికి రానున్నాయి.

పవన్ వారసుడి ఎంట్రీ రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే ఉంటుందని తెలుస్తుంది. సొంత నిర్మాణ సంస్థలోనే తమ్ముడు సినిమా ఉండబోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు అకీరా నందన్ తొలి సినిమా రామ్ చరణ్ కాకుండా మరో నిర్మాత చేతుల్లో పడుతుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా బండ్ల గణేష్ చేసిన ఒక్క ట్వీట్‌తో కన్ఫ్యూజన్ మొదలైపోయింది. పవన్, అకీరా ఉన్న ఫోటో ట్వీట్ చేసి నా దేవుడితో నా హీరో అంటూ రాసుకొచ్చాడు బండ్ల గణేష్. దాంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: