Posani Krishna Murali - Pawan Kalyan: మెగా నటుడు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈవెంట్ ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఇక అందులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎంతలా వైరల్ గా మారాయో చూసాం. పవన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు రాజకీయ నాయకులు పవన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పోసాని కృష్ణ మురళి కూడా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా మీడియా ముందుకు వచ్చిన పోసాని పవన్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని కౌంటర్లు వేసాడు. రిపబ్లిక్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వచ్చాడని.. సాయి ధరమ్ తేజ్ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పైకి రాలేదని అతడు చాలా మంచివాడని తెలిపాడు. తనను తండ్రితో సమానంగా చూస్తాడని.. చిత్రలహరి సినిమాలో తేజ్ కు తండ్రి పాత్రలో చేశానని తెలిపాడు. కానీ దురదృష్టం ఏమోగానీ ప్రమాదం జరిగిందంటూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
ఆయన సినిమా ఈవెంట్ కు పవన్ వెళ్లాడని.. కానీ అక్కడ మాట్లాడాల్సిన మాటలు, మాట్లాడిన మాటలు ఏంటని ప్రశ్నించాడు. అక్కడ ముఖ్యమంత్రి, మంత్రులను సన్నాసుల్లారా, వెధవల్లారా అని తిడతాడా అంటూ.. దిల్ రాజు రెడ్డి.. మీరు రెడ్డి, ఆయన రెడ్డి అంటూ మీరు మీరు మాట్లాడుకోండి అంటూ ఎలా అంటాడని ప్రశ్నించాడు. ఇక మీకు ఆడవాళ్ళ అంటే గౌరవం కదా.. ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తా అని సినిమాలు డైలాగులు చెప్పారు కదా.. మరి పదహారేళ్లప్పుడే సినీ ఇండస్ట్రీకీ ఓ పంజాబీ అమ్మాయి వచ్చిందని ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యండి అంటూ ప్రశ్నించాడు.
గతంలో సినీ ఇండస్ట్రీకి ఓ పంజాబీ అమ్మాయి ఎన్నో కలలతో అడుగుపెట్టిందని.. ఆమెకు ఓ ప్రముఖుడు అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేసి కడుపు చేసి చివరకు అబార్షన్ చేసుకోమన్నాడు అని అన్నాడు. ఆమె అతడితో.. ప్రేమ అన్నారు.. పెళ్లి అన్నారు కదా అని అడిగితే ఆమెను బెదిరించాడు అంటూ.. అబార్షన్ చేయించుకో.. కావాలంటే ఎప్పుడైనా రా వేషం ఇస్తా.. ఇది బయట పెడితే నిన్ను లేకుండా చేస్తా అంటూ తనకు అబార్షన్ చేయించాడని తెలిసింది అంటూ తెలిపాడు.
ఇది కూడా చదవండి:రామ్ చరణ్ జీవితంలోకి మరో వ్యక్తి.. ముద్దులు, హగ్గులు ఇస్తూ ఉపాసనకు షాక్
దీంతో ఆ విషయాన్ని పోసాని మళ్లీ ఇప్పుడు తీస్తూ.. మీరు పవర్ స్టార్ కదా.. మీకు ప్రశ్నించే గుణము ఉంది కదా.. ఆ హీరోయిన్ కు న్యాయం చేయండి. ఆ తర్వాత ఎవరి గురించైనా మాట్లాడండి అంటూ కౌంటర్ వేశాడు పోసాని. ఇక పవన్ పోసాని చేసిన వ్యాఖ్యలకు తిరిగి తన ట్విట్టర్ వేదికగా తన స్టైల్ లో మరో కౌంటర్ ఇచ్చాడు. తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అని ట్వీట్ చేయగా.. అందులో హూ లెట్ ది డాగ్స్ ఔట్ అనే పాట పంచుకుంటూ ఈ పాట తనకు ఇష్టమైన పాట అని తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap government, Pawan kalyan, Poonam kaur, Posani Krishna Murali, Tollywood