దాదాపు యేడాదిన్నర గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ మహా శివరాత్రి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘భీష్మ’ చిత్ర యూనిట్‌ను జనసేనాని సినీ నటుడు పవన్ కళ్యాణ్ బొకే ఇచ్చి మరి నితిన్‌తో పాటు ‘భీష్మ’ చిత్ర యూనిట్‌ను అభినందించాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో హీరోగా నితిన్‌తో పాటు దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత నాగ వంశీ.. ఈ సోమవారం పవన్ ఇంటికి వెళ్లారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను నితిన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఈ సందర్భంగా హీరో నితిన్.. పవన్ కళ్యాణ్‌ను కలిసిన క్షణాలు ఎంతో అమూల్యమైందని పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తూనే ఉంటానన్నారు. మరోవైపు నితిన్ .. భీష్మ సక్సెస్‌తో ఇపుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నాడు. మరోవైపు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
మరోవైపు జనసేనాని కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’, లేదా ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ‘పండగ సాయన్న జీవితంపై మరో సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటయ్యాడు. ఇంకోవైపు కిషోర్ పార్ధసాని (డాలీ), కే.యస్.రవీంద్ర (బాబీ) సినిమాలకు ఓకే చెప్పినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheeshma, Janasena, Nithiin, Pawan kalyan, Telugu Cinema, Tollywood, Venky Kudumula