news18-telugu
Updated: November 21, 2019, 3:08 PM IST
పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
త్వరలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు. అయితే పవర్ స్టార్ కోర్టు మెట్లు ఎక్కుతున్నది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాడు. అంతేకాదు సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. మళ్లీ ముఖానికి రంగేసుకొని నటనపై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పింక్‌లో అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్రను పోషించాడు. అదే లాయర్ పాత్రను తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ చేయనున్నాడు. ఈ రకంగా పవర్ స్టార్ సినిమా సాక్షిగా కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు.

పవన్ కల్యాణ్ పింక్ రీమేక్
ఈ సినిమాను పవన్ కళ్యాణ్.. డిసెంబర్ రెండో వారంలో స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైయ్యాయి. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో భారీ కోర్టు సెట్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. డిసెంబర్ రెండో వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టి కేవలం 50 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ రికార్డు టైమ్‌లో పూర్తి చేయాలన్న పట్టుదలతో నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ ఉన్నారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ .. కేవలం 45 రోజులు మాత్రమే కేటాయించినట్టు సమాచారం. అంతేకాదు 2020 మేలో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాయనుండటం విశేషం. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ టైటిల్ పరిశీలనలో ఉంది. ‘పింక్’ హిందీ వెర్షన్లో తాప్సీ చేసిన పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నయనతానను అనుకుంటున్నారు. తమిళంలో ఈ సినిమాను అజిత్ హీరోగా ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 21, 2019, 2:53 PM IST