Pawan Kalyan Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ యాక్షన్ సీన్ లీక్.. వైరల్ అవుతున్న వీడియో..

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)

Pawan Kalyan Hari Hara Veera Mallu: ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాల వీడియోలు, షూటింగ్ ఫోటోలు ముందుగానే లీక్ అవుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు (Pawan Kalyan Hari Hara Veera Mallu) సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్ కూడా ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది.

  • Share this:
ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాల వీడియోలు, షూటింగ్ ఫోటోలు ముందుగానే లీక్ అవుతున్నాయి. ఎన్ని విధాలుగా కంట్రోల్ చేస్తున్నా కూడా ఏదో ఓ రూపంలో లీకులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, లొకేషన్ సీన్స్ బయటికి వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్ కూడా ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కరోనా తర్వాత మళ్లీ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ ఇందులో నటిస్తున్నారు. అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం హరి హర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు.

పాన్ ఇండియన్ స్థాయిలో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా లొకేషన్ నుంచి ఓ యాక్షన్ సీన్ లీక్ అయింది. అందులో మల్ల యోధులతో పవన్ పోరాటం చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. హరి హర వీరమల్లు సినిమా 16వ శతాబ్ధపు కథతో వస్తుంది. కోహినూర్ వజ్రం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో పాతబస్తీ మల్ల యోధులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.


వాళ్ళతో పవన్ చేసే కుస్తీ యుద్ధాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. తాజాగా ఈ సన్నివేశమే లీక్ అయింది. అందులో మల్లయోధులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం కోసం భారీ సెట్ నిర్మించారు. అక్కడే హరి హర వీరమల్లు షూటింగ్ జరుగుతుంది. సంక్రాంతి 2022కు ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే తెలియజేసాడు నిర్మాత ఏఎం రత్నం.

ఈ లీక్ అయిన వీడియోపై చిత్ర యూనిట్ వెంటనే స్పందించింది. ఒరిజినల్ లింకులు తొలగించే పనిలో బిజీ అయ్యారు. దీనిపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి.
Published by:Praveen Kumar Vadla
First published: