హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Director Shankar: రామ్ చరణ్, శంకర్ సినిమాలో పవర్ స్టార్.. నిజమెంత?

Ram Charan - Director Shankar: రామ్ చరణ్, శంకర్ సినిమాలో పవర్ స్టార్.. నిజమెంత?

ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. సెన్సేషనల్ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. అంతేకాదు తన నిర్మాణంలో రాబోయే 50వ సినిమా కావడం విశేషం. నాలుగేళ్ళ కింద అల్లు అర్జున్ డిజే సినిమాతో 25 సినిమాల మైలురాయి అందుకున్నాడు దిల్ రాజు.

ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. సెన్సేషనల్ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. అంతేకాదు తన నిర్మాణంలో రాబోయే 50వ సినిమా కావడం విశేషం. నాలుగేళ్ళ కింద అల్లు అర్జున్ డిజే సినిమాతో 25 సినిమాల మైలురాయి అందుకున్నాడు దిల్ రాజు.

Ram Charan - Director Shankar: మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తోన్న పలు వార్తల్లో పవర్‌స్టార్‌కు సంబంధించిన వార్తొకటి హల్‌చల్ చేస్తుంది

ఇంకా చదవండి ...

  మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు వినిపిస్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌తో ఇప్పుడు శంక‌ర్ చేయ‌బోయేది సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్ జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ స్టార్ ర‌ణ్వీర్ సింగ్‌ను విల‌న్‌గా న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయ‌ని టాక్‌.

  కాగా.. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో హీరోకు స‌మాన‌మైన ప్రాధాన్యం ఉన్న పాత్ర ఒక‌టి ఉంద‌ట‌. ఈ పాత్ర‌ను తెలుగులో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ భావిస్తున్నాడ‌ని టాక్‌. అలాగే తమిళంలో మ‌రో స్టార్ హీరోను శంక‌ర్ న‌టింప చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌. ఒక‌వేళ ఈ సినిమాలో న‌టించ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓకే చెబుతాడో లేదో చూడాలి.

  ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. మార్చి నెల‌నాటికంతా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని జ‌క్క‌న్న అనుకుంటున్నాడ‌ట‌. దీని త‌ర్వాతే శంక‌ర్ సినిమాలో చ‌ర‌ణ్ పార్టిసిపేట్ చేస్తాడు. దిల్‌రాజు, శిరీశ్ క‌లిసి ఈ భారీ బ‌డ్జెట్ మూవీని నిర్మించ‌నున్నారు. దీంతో పాటు రామ్‌చ‌ర‌ణ్ ఓ యంగ్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

  Published by:Anil
  First published:

  Tags: Ram Charan, Shankar

  ఉత్తమ కథలు