Home /News /movies /

POWER STAR PAWAN KALYAN GOING TO TEAM UP WITH DIRECTOR SURENDAR REDDY AND VAKKANTHAM VAMSHI FOR HIS NEXT FILM MS

Pawan Kalyan: జోరు పెంచిన పవన్.. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ తో 29 వ సినిమా..?

పవన్ కళ్యాణ్ (File)

పవన్ కళ్యాణ్ (File)

Pawan Kalyan - Surendar Reddy: పవర్ స్టార్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు మళయాళి రిమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియం’, క్రిష్ సినిమాలు కూడా లైన్లోనే ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
    Pawan Kalyan - surendar reddy: ఎన్నికల తర్వాత వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టును పట్టాల మీదకు తీసుకెళ్తున్నారు. ఒక్కదాని తర్వాత మరోకటి ఓకే చేస్తూ దూకుడు మీదున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వీటితో పాటు మళయాళి రిమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియం’, క్రిష్ సినిమాలు కూడా లైన్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ 29 వ చిత్రాన్ని టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ లో చేయనున్నట్టు కృష్ణానగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, క్రేజీ రైటర్ వక్కంతం వంశీల కాంబినేషన్ లో పవన్ 29 వ సినిమా ఉండనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

    ఆదివారం వక్కంతం వంశీ పుట్టిన రోజు సందర్భంగా.. కొంతమంది నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. బర్త్ డే పోస్టులు పెడుతూనే #pspk29 అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ఉపయోగించారు. దీంతో పవన్.. తదుపరి సినిమా వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి కాంబో లోనే ఉండబోతున్నదని తెలుస్తున్నది. ఇప్పటికే వంశీ, సూరీలు కలిసి కథ కూడా వినిపించారని.. దానిని పవన్ ఓకే చేశారని గుసగుసలు కూడా టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి.

    వక్కంతం వంశీ - సురేందర్ రెడ్డి లది హిట్ కాంబో అని అందరికీ తెలిసిందే. వారి కాంబినేషన్ లో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు వచ్చాయి. పవర్ స్టార్ ఇమేజీకి తగ్గట్టుగా వంశీ ఓ కథ సిద్ధం చేశారని.. అది డైరెక్టర్ కు, పవన్ కు నచ్చి ఈ ప్రాజెక్టును ఫైనల్ చేశారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. కాగా.. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్.. తదుపరి చిత్రంగా హరీశ్ శంకర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. దీంతో పాటు పూరీ జగన్నాథ్ తో కూడా ఆయన ఒక సినిమా చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతుంది. అయితే వంశీ-సూరీ సినిమా పైగానీ.. పూరి సినిమా పై గానీ ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Pawan kalyan, Power Star Movie, PSPK 29, Surender reddy, Vakkantham vamsi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు