Home /News /movies /

POWER STAR PAWAN KALYAN FIRE ON YSRCP GOVERNMENT IN SAI DHARAM TEJ REPUBLIC PRE RELEASE EVENT NR

Pawan Kalyan - Sai Dharam Tej: సాయి తేజ్ ఇంకా కళ్లు తెరవలేదు.. మీ పెట్టుబడి ఏంటంటూ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

Pawan Kalyan - Sai Dharam Tej

Pawan Kalyan - Sai Dharam Tej

Pawan Kalyan - Sai Dharam Tej:మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించినటువంటి రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 25) హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో అట్టహాసంగా జరిగింది.

    Pawan Kalyan - Sai Dharam Tej:మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించినటువంటి రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 25) హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో అట్టహాసంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మెగా హీరో సాయిధరమ్ హాజరు కాలేక ఆయన స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేడుకలో పాల్గొన్నారు. సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ మాట్లాడుతూ.. సాయి తేజ్ ఇంకా కళ్ళు తెరవలేదని, ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కుదుటపడుతుందని, ఇంకా తను బెడ్ పైనే ఉన్నారని తెలియజేశారు.

    ఏది ఏమైనప్పటికీ సాయిధరమ్ తేజ్ తన సినిమా రిలీజ్ వేడుకలో, ప్రమోషన్ లలో పాల్గొన్న లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన విడుదల చేయాల్సి ఉంది. అయితే సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత ఈ సినిమా విడుదల చేయాలా..వద్దా.. అని నిర్మాతలు కొంతమేర ఆలోచించిన ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

    ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు. ఇక సాయి ధరమ్ తేజ్ కి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం కనుక తన సినిమా ప్రమోషన్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం గమనార్హం. ఇక ఈ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమ పై వైసీపీ నేతలు కన్నెత్తి చూసిన కాలి పోతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రవేట్ పెట్టుబడులతో సినిమాలు తీసే సినిమా విషయంలో ప్రభుత్వం పెత్తనం ఏంటని? ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం సినిమా పెద్దలు ఎందుకు ఆలోచిస్తున్నారని ఇది వైసిపి రిపబ్లిక్ కాదని.. ఇండియన్ రిపబ్లిక్ అంటూ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇలాగే చేస్తుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Cm jagan, Pawan kalyan, Republic Movie, Sai Dharam Tej, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు