• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • POWER STAR PAWAN KALYAN DAUGHTER AADHYA ENTRY INTO TV WITH RENU DESAI DRAMA JUNIORS IN ZEE TELUGU PK

Pawan Kalyan daughter Aadhya: బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య.. ప్రోమో వైరల్..

Pawan Kalyan daughter Aadhya: బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య.. ప్రోమో వైరల్..

కూతురు ఆద్యతో రేణు దేశాయ్ (Renu Desai Aadhya)

Pawan Kalyan daughter Aadhya: ఆద్య కొణిదెల.. మెగా అభిమానులకు అయితే ఈ పేరుతో కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్(Renu Desai) ముద్దుల కూతురు ఈమె. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆద్యకు(Aadhya) మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈమె బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది.

  • Share this:
ఆద్య కొణిదెల.. మెగా అభిమానులకు అయితే ఈ పేరుతో కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ముద్దుల కూతురు ఈమె. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆద్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. పవన్‌తో విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ తీసుకుని పూణే వెళ్లిపోయారు రేణు. అక్కడే ఉండి తన లైఫ్ గడుపుతున్నారు. ఈ మధ్యే మళ్లీ హైదరాబాద్ వచ్చి సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్‌లో సందడి చేస్తున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు పిల్లలు ఆద్య, అకీరా నందన్‌లను కూడా అభిమానులకు చేరువ చేస్తుంటారు. మెగా కుటుంబానికి కూడా వాళ్లెప్పుడూ దగ్గరగానే ఉంటారు. ఈ మధ్యే జరిగిన నిహారిక పెళ్లికి కూడా పిల్లలిద్దరూ హాజరయ్యారు. తండ్రితో పాటు అక్కడే ఉన్నారు. ఎప్పుడు సమయం దొరికినా కూడా వెంటనే తండ్రి దగ్గరికి వచ్చేస్తుంటారు అకీరా, ఆద్య. వాళ్లకు కేరాఫ్ పవన్ కళ్యాణ్ అనేదే పెద్ద బ్రాండ్. అందుకే అకీరా, ఆద్య ఎక్కడ కనిపించినా కూడా కెమెరా కళ్లు మొత్తం వాళ్లపైనే ఉంటాయి. పైగా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు ఈ పిల్లలు. ఈ క్రమంలోనే తాజాగా ఆద్య బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.

పవన్ గారాల పట్టి ఓ టీవీ ఛానెల్‌లో కనిపించడమే కాకుండా అక్కడ తన ముద్దు ముద్దు మాటలతో అలరించింది. తొలిసారి పబ్లిక్ ప్లాట్ ఫామ్‌లో కనిపించింది. రేణు దేశాయ్ జడ్జిగా ఉన్న ‘డ్రామా జూనియర్స్’ షోలో లిటిల్ ప్రిన్సెస్ ఆద్య కూడా వచ్చింది. అక్కడ తన పాపను చూసి ఎమోషనల్ అయిపోయారు రేణు దేశాయ్.

తన కూతురును చూసి నువ్వు నా జీవితంలో దొరికిన అతిపెద్ద వరం అంటూ ముద్దు పెట్టుకున్నారు. అలాగే ఆద్య కూడా ప్రపంచంలో నువ్వే బెస్ట్ మమ్మీ అంటూ కామెంట్ చేసింది. ఈ ప్రోమో వైరల్ అవుతుంది. మదర్స్ డే సందర్భంగా మే 9న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. పవన్ అభిమానులు అయితే ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: