• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • POWER STAR PAWAN KALYAN CREATING NEW RECORDS IN MAHESH BABU AMB CINEMAS IN HYDERABAD WITH VAKEEL SAAB PK

Vakeel Saab record in AMB Cinemas: మహేష్ బాబు మల్టీప్లెక్స్‌లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సంచలనం..

Vakeel Saab record in AMB Cinemas: మహేష్ బాబు మల్టీప్లెక్స్‌లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సంచలనం..

వకీల్ సాబ్ పోస్టర్ (Vakeel Saab Poster)

Vakeel Saab record in AMB Cinemas: హైదరాబాద్‌లో ఉన్న భారీ మల్టీప్లెక్సులలో ఒకటైన AMB సినిమాస్‌లో ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు పవర్ స్టార్. నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే.. ఇప్పుడు చూద్దామంటే కూడా ఒక్కటి కూడా లేవు. ఒకటి రెండు కాదు.. 27 షోలు మొత్తం హౌజ్ ఫుల్స్ అయిపోయాయి.

  • Share this:
పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వకీల్ సాబ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సినిమాకు తొలిరోజు ఊహించని విధంగా ఓపెనింగ్స్ రావడం ఖాయం అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న భారీ మల్టీప్లెక్సులలో ఒకటైన AMB సినిమాస్‌లో ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు పవర్ స్టార్. సీటింగ్ పరంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ఇది. అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌కు తోడు అన్నీ అద్భుతంగా కుదిరాయి. మూడేళ్ళ చరిత్ర ఉన్న ఈ థియేటర్‌లో మునుపెన్నడూ లేని రికార్డులకు తెరతీస్తున్నాడు వకీల్ సాబ్. మహేష్ బాబుకు కూడా సాధ్యం కాని రికార్డులను ఇప్పుడు పవన్ తిరగరాస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మహేష్ అడ్డాలో పవన్ దాదాగిరి చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే వకీల్ సాబ్ సినిమాకు అక్కడ తొలిరోజు వసూళ్లు చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో AMB సినిమాస్‌లో టికెట్స్ బుక్ అయిపోతున్నాయి. నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే.. ఇప్పుడు చూద్దామంటే కూడా ఒక్కటి కూడా లేవు.

ఒకటి రెండు కాదు.. 27 షోలు మొత్తం హౌజ్ ఫుల్స్ అయిపోయాయి. టికెట్స్ హాట్ కేక్స్ కంటే దారుణంగా అమ్ముడైపోయాయి. పవన్ సినిమా కోసం మూడేళ్లుగా చూస్తున్న అభిమానులకు వకీల్ సాబ్ విందు భోజనంలా కనిపిస్తుంది. అందుకే తొలిరోజు టికెట్స్ ఎక్కడా దొరికే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇది నిజంగానే కొత్త రికార్డు. విడుదలకు మూడు రోజుల ముందే ఒక్క టికెట్ కూడా లేకపోవడం రికార్డు. గతంలో సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలైనపుడు కూడా హౌజ్ ఫుల్స్ అయ్యాయి కానీ మరీ ఇన్నేసి షోలు మాత్రం కాలేదు.
Vakeel Saab record in AMB Cinemas,Vakeel Saab 1st day collections,Vakeel Saab tickets,Vakeel Saab tickets sold out in AMB Cinemas,pawan kalyan mahesh babu,వకీల్ సాబ్ ఫస్ట్ డే టికెట్స్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,పవన్ కళ్యాణ్ మహేష్ బాబు
వకీల్ సాబ్ పోస్టర్ (Vakeel Saab Poster)

హిస్టరీ చూసుకుంటే ఇప్పుడు పవన్ కొత్త చరిత్ర రాస్తున్నాడు. రెండు, మూడో రోజుల్లో కూడా దాదాపు 80 శాతం టికెట్స్ బుక్ అయిపోయాయి. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఆగమనం మామూలుగా ఉండదని అర్థమైపోతుంది. కచ్చితంగా తొలిరోజు కొత్త రికార్డులకు తెరతీయడం ఖాయంగా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: