#HappyBirthdayPawanaKalyan :  పుట్టినరోజును జరుపుకుంటున్న పవన్.. ట్విట్టర్‌లో ట్రెండింగ్..

#HappyBirthdayPawanaKalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వెల్లువలా పవన్‌కు శుభాకాంక్షలు తెలపడంతో ప్రస్తుతం HappyBirthdayPawanaKalyan ట్విట్టర్‌లో ట్రెండింగ్.. అవుతోంది.

news18-telugu
Updated: September 2, 2019, 9:08 AM IST
#HappyBirthdayPawanaKalyan :  పుట్టినరోజును జరుపుకుంటున్న పవన్.. ట్విట్టర్‌లో ట్రెండింగ్..
Twitter
news18-telugu
Updated: September 2, 2019, 9:08 AM IST
#HappyBirthdayPawanKalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈరోజు వినాయక చవితి కూడా కావడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు వినాయకుడినీ, ఇటు పవన్ కళ్యాణ్‌నూ పక్కపక్కన పెట్టి... శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు. అది అలా ఉంటే పవన్... సినిమా తెరపైనే కాకుండా... నిజ జీవితంలో పాటింటే విలువలు, ఆయన నడక, నడత అన్నీ అభిమానులకు ఆయనంటే ఎంతో రెస్పెక్ట్ తీసుకొచ్చేలా చేశాయి. తెలుగు సినిమా హీరోల్లో పవన్ కళ్యాణ్ ఓ ది డిఫరెంట్ స్టైల్. ఆయన ఏది చేసినా ఓ సంచలనమే. మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పచుకొన్న.. ఆ తర్వాత.. తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో  స్టార్ డమ్ సంపాదించుకున్నాడు పవన్.

పవన్ కల్యాణ్ .... 1971, సెప్టెంబర్ 2న బాపట్లలో కే.వేంకట్రావు, అంజనాదేవిలకు మూడో కొడుకుగా జన్మించాడు. తన 23 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో 23 సినిమాల్లో హీరోగా నటించాడు పవన్. కాగా.. ప్రస్తుతం  పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  అది అలా ఉంటే పవన్ ఈరోజు ఆయన పుట్టినరోజును జరుపుకోవడంతో సినీ ఇండస్ట్రీ నుండే కాకుండా.. పలు రాజకీయ నాయకులు, అభిమానులు ట్విట్టర్‌లో HappyBirthdayPawanaKalyan అంటూ విష్ చేస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం ట్విట్టర్‌లో 'వ్యాపీ బర్త్ డే' పవన్ కళ్యాణ్  ట్రెండింగ్ అవుతోంది.






















First published: September 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...