Pawan kalyan - Badri: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్ నటించిన సినిమా బద్రి. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి నేటితో 21 ఏళ్ళు అయ్యింది. పవర్ ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెబ్యూ చిత్రం ఈ బద్రి. అప్పట్లో మంచి సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రంలోని డైలాగులు ఇప్పటికి అప్పుడప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయ్.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా ప్రకాష్ రాజ్ హీరోయిన్ అన్నగా.. విలన్ పాత్రలో నటించాడు. ఒకానొక సందర్భంలో వీరి ఇద్దరి మధ్య జరిగే ఒక డైలాగ్ ఇప్పటికి ట్రేండింగ్ లో ఉంది. ''నువ్వు నంద అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్'' అని చెప్పే డైలాగ్ ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది.
ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ప్రకాష్ రాజ్ నంద పాత్ర చెయ్యడంతో బద్రి సినిమా డైలాగ్ కొద్దిరోజులపాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది కూడా. అలాంటి ఈ సినిమా విజయవంతంగా 21 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో బద్రి21ఇయర్స్ అనే ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ కు, తెలుగు ఇండస్ట్రీకి రేణు దేశాయ్ పరిచయం అవ్వగా ఈ సినిమాను టి త్రివిక్రమరావు నిర్మించగా 21 ఏళ్ళ ముందే 18 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amisha patel, Badri, Pawan kalyan, Renu Desai, Tollywood film, Viral dialogues