Pawan Kalyan Tholi Prema: పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘తొలిప్రేమ’కు 23 ఏళ్ళు పూర్తి..

తొలి ప్రేమ సినిమాకు 23 ఏళ్ళు (Tholi prema movie)

Pawan Kalyan Tholi Prema: ఇవివి సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య, భీమినేని లాంటి పేరున్న దర్శకులతో తొలి మూడు సినిమాలు చేసిన తర్వాత తనకు తానుగా సొంతంగా నిర్ణయించుకుని.. కొత్త దర్శకుడితో పవన్ చేసిన సినిమా తొలి ప్రేమ(Pawan Kalyan Tholi Prema).

  • Share this:
అప్పటికే చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్.. వరస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్‌గానే ఆడినా.. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు పవన్ స్థాయిని పెంచేసాయి. అలాంటి సమయంలో కొత్త దర్శకుడు ఏ కరుణాకరణ్ చెప్పిన కథ నచ్చి తొలి ప్రేమ సినిమా చేసాడు పవర్ స్టార్. తెలుగమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ‘ఎస్.ఎస్.వి ఆర్ట్స్’ బ్యానర్‌పై జివిజి రాజు నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ హోదాను అందుకుంది. పవన్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా కూడా తొలిప్రేమ రేంజ్ మాత్రం సపరేట్.

ఇవివి సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య, భీమినేని లాంటి పేరున్న దర్శకులతో తొలి మూడు సినిమాలు చేసిన తర్వాత తనకు తానుగా సొంతంగా నిర్ణయించుకుని.. కొత్త దర్శకుడితో పవన్ చేసిన సినిమా తొలి ప్రేమ. 1998లో అప్పటికే సుస్వాగతం లాంటి బ్లాక్‌బస్టర్ అందుకున్న పవన్.. అదే ఏడాది జూలై 24న విడుదలైన తొలిప్రేమతో వచ్చాడు. అది క్లాసికల్ హిట్‌గా నిలిచింది. పాత్ బ్రేకింగ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో వసూలు చేసిన మొత్తం ఎంతో చూద్దాం..

tholi prema movie,tholi prema movie 23 years,pawan kalyan tholi prema movie 23 years,tholi prema movie pawan kalyan classic,telugu cinema,tholi prema movie collections,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ తొలిప్రేమ కలెక్షన్స్,తొలి ప్రేమ సినిమాకు 23 ఏళ్ళు
తొలి ప్రేమ సినిమాకు 23 ఏళ్ళు (Tholi prema movie)


నైజాం: 2.97 కోట్లు
సీడెడ్: 1.52 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.04 కోట్లు
ఈస్ట్: 0.66 కోట్లు
వెస్ట్: 0.51 కోట్లు
గుంటూరు: 0.69 కోట్లు
కృష్ణా: 0.53 కోట్లు
నెల్లూరు: 0.36 కోట్లు

ఏపీ + తెలంగాణ: 8.28 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.32 కోట్లు
వరల్డ్ వైడ్: 8.60 కోట్లు

tholi prema movie,tholi prema movie 23 years,pawan kalyan tholi prema movie 23 years,tholi prema movie pawan kalyan classic,telugu cinema,tholi prema movie collections,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ తొలిప్రేమ కలెక్షన్స్,తొలి ప్రేమ సినిమాకు 23 ఏళ్ళు
తొలి ప్రేమ సినిమాకు 23 ఏళ్ళు (Tholi prema movie)


అప్పటికే వరసగా రెండు విజయాలు రావడంతో ‘తొలిప్రేమ’ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. 23 ఏళ్ళ కిందే ఈ చిత్రాన్ని 4.27 కోట్లకు అమ్మారు. అప్పట్లో ఇది ఎక్కువ మొత్తమే. ఫుల్ రన్‌‌లో తొలి ప్రేమ 9 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. అంటే బయ్యర్లకు దాదాపు 4.50 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.
Published by:Praveen Kumar Vadla
First published: