రీ ఎంట్రీ తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ఐదు సినిమాల్లో పవన్‌కల్యాణ్ నటించనున్నట్లు దర్శక నిర్మాతలు అధికారిక ప్రకటనను కూడా ఇచ్చుకున్నారు. అందులో ముందుగా వకీల్‌సాబ్ షూటింగ్‌ను పూర్తి చేసేశాడు. తర్వాత ఏ సినిమాను పవన్స్టార్ట్ చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాని సమయంలో పవన్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ రీమేక్‌లో నటించడానికి కొబ్బరికాయ కొట్టేశాడు. మరి క్రిష్ సినిమా ఏమవుతుంది అని చాలా మందిలో సందేహం వ్యక్తమయ్యింది. అయితే పవన్‌కల్యాణ్ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నాడట. రెండు సినిమాలను ఓకేసారి స్టార్ట్ చేసేశాడు. ముందుగా క్రిష్ దర్శకత్వంలో ఇది వరకే స్టార్ట్ చేసిన సినిమా షూటింగ్‌ను సోమవారం షురూ చేసేశాడు.
పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న 27వ చిత్రం. ఎ.ఎం.రత్నం నిర్మాత. ఈ సినిమాలో ఎక్కువగా సీజీ వర్క్‌కు స్కోప్ ఉండటంతో ఎక్కువ భాగం షూటింగ్‌ను సెట్స్‌లోనే చిత్రీకరిస్తారు. కాబట్టి పవన్‌కల్యాణ్‌కు షూటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్టర్ క్రిష్ ప్లాన్స్ చేసుకున్నాడు. ఏప్రిల్, మే నాటికి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనేది క్రిష్ ఆలోచనగా కనిపిస్తోంది. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
క్రిష్ సినిమాను కొన్ని రోజుల పాటు చిత్రీకరణ చేసిన తర్వాత మళ్లీ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ రీమేక్ షూటింగ్‌లోనూ పాల్గొంటాడు. రెండు సినిమాలను ఈ ఏడాదిలోనూ పూర్తి చేయాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది.