ఏంటి నందమూరి బాలకృష్ణ సినిమాలో పవర్‌స్టార్ నటిస్తున్నారా? ఏం జరగుతుంది.. అని ఆశ్చర్యపోతున్నారా! అయితే ఇది నిజం. కానీ బాలకృష్ణ సరసన నటిస్తుంది టాలీవుడ్ పవర్‌స్టార్ కాదు. శాండిల్‌వుడ్ పవర్‌స్టార్. వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కోవిడ్ ప్రభావానికి ముందే ఓ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోవిడ్ తర్వాత ఇటీవల షూటింగ్‌ను పునః ప్రారంభించుకుంది. ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో హీరోయిన్ పూర్ణ నటిస్తుంది. తన సినిమాపై ఉన్న అంచనాలకు ధీటుగా బోయపాటి శ్రీను ప్లానింగ్ చేసకుంటున్నాడట. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలోనటిస్తున్నారట. ఇందులో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉందట. అందులో పునీత్ రాజ్‌కుమార్ నటిస్తున్నాడనే వార్తలు నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. అదే అనుబంధంతో గతంలో బాలకృష్ణ వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణలో పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివరాజ్‌కుమార్ అతిథి పాత్రలో మెరిశాడు. ఇప్పుడు పునీత్‌రాజ్‌కుమార్ ఓ పాత్రలో కనిపిస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ 106వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇందులో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నారని అందులో ఓ పాత్ర అఘోర అయితే మరో పాత్రలో బాలకృష్ణ సిన్సియర్ ఐఏయస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

punith rajkumar
సింహా, లెంజెడ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్‌తో బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.