పోసానికి 35 ఆఫర్లు... అంతా మెగా హీరో పుణ్యమే...

పోసాని కృష్ణమురళి

టెంపర్, నాయక్ సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమని ప్రశ్నించగా... వెంటనే నాయక్ అని సమాధానం ఇచ్చారు పోసాని కృష్ణమురళి.

  • Share this:
    టాలీవుడ్‌లో నటుడు పోసాని కృష్ణమురళిది డిఫరెంట్ స్టయిల్. ఆయన యాక్టింగ్ కూడా మిగతా వారికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రచయితగా సక్సెస్ సాధించి...నటుడిగా ఎంట్రీ ఇచ్చిన పోసాని కృష్ణమురళి...యాక్టర్‌గా ఫుల్ బిజీ అయ్యారు. కమెడియన్‌గా ఓ రేంజ్‌లో సక్సెస్ సాధించిన పోసానికి బ్రేక్ ఇచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే పోసానికి ఊహించనన్ని సినిమాలు తీసుకొచ్చిన క్రెడిట్ మాత్రం నాయక్ సినిమాకే దక్కుతుంది. ఈ విషయాన్ని పోసాని కృష్ణమురళి స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న పోసాని... ఈ విషయాన్ని తెలిపారు.

    టెంపర్, నాయక్ సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమని ప్రశ్నించగా... వెంటనే నాయక్ అని సమాధానం ఇచ్చారు పోసాని కృష్ణమురళి. ఇందుకు కారణం కూడా చెప్పారు. నాయక్ రిలీజైన వెంటనే తనకు ఏకంగా 35 సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని వివరించారు. నాయక్ తరువాతే టెంపర్ వచ్చింది కాబట్టి... తనకు నాయక్ సినిమా అంటేనే ఇష్టమని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి నాయక్ మూవీ రామ్ చరణ్ కంటే ఎక్కువగా పోసాని కెరీర్‌కే ప్లస్ అయినట్టు అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: