NTR- Posani Krishna Murali: రాజ‌కీయాల్లోకి ఎన్టీఆర్.. పోసాని కృష్ణ‌ముర‌ళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఎన్టీఆర్ పోసాని కృష్ణమురళి

జూనియ‌ర్ ఎన్టీఆర్(NTR) రాజ‌కీయాల్లోకి రావాల‌ని అభిమానులు ఎప్ప‌టినుంచో కోరుకుంటున్న విష‌యం తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన త‌రువాత అభిమానుల్లో ఈ కోరిక మరింత పెరిగింది. తెలుగుదేశం పార్టీ ప‌గ్గాలు జూనియ‌ర్‌కి అప్ప‌గించాల‌ని అప్ప‌ట్లో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) దగ్గరే త‌మ మ‌న‌సులోకి భావాల‌ను వ్య‌క్త‌ప‌రిచినట్లు వార్తలు వినిపించాయి

  • Share this:
    NTR- Posani Krishna Murali : జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అభిమానులు ఎప్ప‌టినుంచో కోరుకుంటున్న విష‌యం తెలిసిందే.  2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన త‌రువాత అభిమానుల్లో ఈ కోరిక మరింత పెరిగింది. తెలుగుదేశం పార్టీ ప‌గ్గాలు జూనియ‌ర్‌కి అప్ప‌గించాల‌ని అప్ప‌ట్లో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరే త‌మ మ‌న‌సులోకి భావాల‌ను వ్య‌క్త‌ప‌రిచినట్లు వార్తలు వినిపించాయి. అయితే పార్టీకి ఎన్టీఆర్ అవ‌స‌రం లేదంటూ పార్టీలోని కొంత‌మంది బ‌హిరంగంగానే మాట్లాడారు. మ‌రోవైపు ఒక‌ప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సైతం పాల్గొన్న ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం రాజ‌కీయాల‌పై పెద్ద‌గా ఆస‌క్తిని చూప‌డం లేదు. ఎక్క‌డైనా రాజ‌కీయాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు ఎద‌రైనా సింపుల్‌గా వాటి స్కిప్ చేస్తూ వ‌స్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫొటోలు ఏపీలో మ‌రోసారి సంచ‌ల‌నం రేపాయి. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ కొంత‌మంది అభిమానులు ఫ్లెక్సీలు క‌ట్టించారు. దీనిపై తెలుగు త‌మ్ముళ్లు పెద్ద‌గా ఏం మాట్లాడ‌లేదు.

    అయితే రాజ‌కీయాల్లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌వేశంపై న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ చాలా చిన్నోడ‌ని.. ప్ర‌స్తుతం అత‌డి దృష్టి అంతా సినిమాల‌పై ఉంద‌ని పోసాని తెలిపారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌ని, త‌న తాతలాగా ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని, అలాంట‌ప్పుడు ఆయ‌న మీద మాటలు మాట్లాడ‌టం వేస్ట్ అని పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోవ‌డం త‌ప్పేం కాద‌ని పోసాని వెల్ల‌డించారు. ఒక‌వేళ త‌న తాతలాగా రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉండి, సిన్సియ‌ర్ పొలిటీషియ‌న్‌గా వ‌స్తే ఎవ్వ‌రికైనా ఇక్క‌డ అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

    అలా కాకుండా నేను పెద్ద స్టార్‌ని, నేను ముఖ్య‌మంత్రిని అవుతాను అనుకుంటే ఇక్క‌డ కుద‌ర‌ద‌ని అన్నారు. ఎవ‌రెవ‌రు ముఖ్య‌మంత్రి అవ్వాల‌నుకుంటున్నారో వారికి ప్ర‌జ‌లు మెచ్చే క్వాలిటీలు ఉంటే విజ‌యం సాధిస్తార‌ని పేర్కొన్నారు. అలా కాకుండా నిద్ర లేచి వారిని తిట్టాలి, వీరిని తిట్టాలి, ఎవ్వ‌రూ మ‌న‌ల్ని అన‌కూడ‌దు.. ఇలాంటి ద్రుక్భ‌దాలతో ఉంటే ప్ర‌జ‌లు అస్స‌లు ఒప్పుకోర‌ని పోసాని కృష్ణ ముర‌ళి అన్నారు.
    Published by:Manjula S
    First published: