‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సమయంలో గొడవ.. అందుకే ఆ సినిమా నుంచి తీసేశారన్న పోసాని

పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి (ఫైల్ ఫోటో)

Pawan Kalyan Posani Krishna Murali: పవన్ కళ్యాణ్ గతంలో ఒకసారి తనకు ఫోన్ చేసి గట్టిగా అరిచారని పోసాని కృష్ణమురళి అన్నారు.

 • Share this:
  పవన్ కళ్యాణ్‌తో పోసాని కృష్ణమురళి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు తన భార్యపై అసభ్య మెసేజ్‌లు పెట్టారని ఆరోపించిన పోసాని కృష్ణమురళి.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గతంలో ఒకసారి తనకు ఫోన్ చేసి గట్టిగా అరిచారని పోసాని అన్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కోసం తనను ఓసారి రాత్రి సమయంలో రావాలని అన్నారని పోసాని చెప్పారు. తాను చెప్పిన సమయానికి వెళ్లానని.. తాను చెప్పినట్టుగానే సమయానికి అక్కడి నుంచి వచ్చేశానని అన్నారు. ఆ రోజు రాత్రి 10.30 గంటల సమయంలో భోజనం చేస్తుండగా పవన్ ఫోన్ చేసి తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పోసాని తెలిపారు. ఇది సినిమా అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా? ఎవరికి చెప్పి ఇంటికి వెళ్లారు? మేమందరం పిచ్చోళ్లమా? అంటూ పవన్ కేకలు వేశారని అన్నారు. దాంతో తాను కూడా ఆయనకు జరిగింది చెప్పి అదే స్థాయిలో సమాధానం ఇచ్చానని అన్నారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి తనను తీసేశారని పోసాని కృష్ణమురళి వివరించారు.

  తన భార్య, కుటుంబంపై పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు అనుచితమైన కామెంట్స్ చేస్తూ మెసేజ్‌లు చేస్తున్నారని మండిపడ్డ పోసాని కృష్ణమురళి.. వారికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన కుటుంబంపై అనుచితమైన విమర్శలు చేసి తనను డిమోరలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

  కొందరు ఫోన్ చేసి తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారని పోసాని మండిపడ్డారు. తన కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా ? అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై పరుషపదజాలంతో విమర్శలు చేశారు.

  IT Return: ఆఖరి నిమిషం వరకు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేదా?.. ఫైన్ కట్టాల్సిందే.. ఎంతంటే..

  LPG Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలా ? ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..

  పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి తీవ్రమైన విమర్శలు చేయడాన్ని తట్టుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు.. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. పోసాని కృష్ణమురళిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: