2019 ఎన్నికల్లో సినిమావాళ్ల ప్రభావం చాలానే కనిపిస్తుంది. ప్రతి పార్టీలోనూ సినిమా సంబంధిత వ్యక్తులు ఉన్నారు. వైసిపిలో ఈ సినిమా గాలి కాస్త ఎక్కువగానే వీస్తుంది. పేరున్న కమెడియన్లు, నటులు అంతా ఇప్పటికే జగన్ పక్కన చేరిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కాదని మరి కమెడియన్ అలీ వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇదిలా ఉంటే 30 ఇయర్స్ పృథ్వీ, రాజశేఖర్ దంపతులు కూడా జగన్ దగ్గరే ఉన్నారు. ఇక అందరి కంటే ముందు నుంచి కూడా జగన్ దగ్గరే ఉన్నాడు దర్శక నిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళి.
ఇక ఇప్పుడు ఈయన వైయస్ జగన్‌కు సపోర్ట్‌గా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది పూర్తిగా పొలిటికల్ సెటైర్. వైసీపీకి ఎన్నికల్లో పనికొచ్చేలా.. ప్రచారంలో వాడుకునేలా ఉండబోతుంది ఈ సినిమా. తెలుగుదేశం ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ఈ సినిమా కథ సిద్ధం చేస్తున్నాడు పోసాని. కొన్ని రోజులుగా నటనతో బిజీగా ఉండి దర్శకత్వానికి దూరంగా ఉన్న పోసాని.. ఇప్పుడు జగన్ కోసం మళ్లీ మెగాఫోన్ పడుతున్నాడు. కేవలం 25 రోజుల్లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి ఎన్నికలకు సరిగ్గా పదిహేను రోజుల ముందు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఫిబ్రవరి చివర్లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారనేది ఇంకా క్లారిటీ లేకపోయినా పోసాని మాత్రం ఇప్పటికే కథ సిద్ధం చేసుకుంటున్నాడు. పదేళ్ల కింద చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా రాజావారి చేపల చెరువు అంటూ ఇలాంటి పొలిటికల్ సెటైర్ సినిమా ఒకటి చేశాడు పోసాని కృష్ణమురళి. మళ్లీ ఇన్నేళ్లకు ఎన్నికల ముందు అలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇది ఎలా ఉండబోతుందో.. నిజంగానే జగన్ కు ప్రచారంలో పనికొస్తుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Telugu Cinema, Ys jagan, Ysrcp