బాలకృష్ణకు కోపం వస్తే సమాజం మునిగిపోదు.. పోసాని కామెంట్స్..

Posani Krishna Murali: చాలా రోజుల తర్వాత రైటర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణమురళి మీడియాతో ముచ్చటించాడు. ఇందులో సినీ రాజకీయ విషయాలెన్నో మాట్లాడాడు. ముఖ్యంగా కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 7, 2020, 5:30 PM IST
బాలకృష్ణకు కోపం వస్తే సమాజం మునిగిపోదు.. పోసాని కామెంట్స్..
బాలయ్య పోసాని (balakrishna posani)
  • Share this:
చాలా రోజుల తర్వాత రైటర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణమురళి మీడియాతో ముచ్చటించాడు. ఇందులో సినీ రాజకీయ విషయాలెన్నో మాట్లాడాడు. ముఖ్యంగా కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో బాగా వేడి రాజేస్తున్న బాలకృష్ణ విషయంపై కూడా నోరు విప్పాడు ఈ పొలిటికల్ లీడర్ కమ్ సినిమా యాక్టర్. బాలయ్య కోపం గురించి.. ఆయన చేసిన కామెంట్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు పోసాని. వైసీపీ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని.. జగన్ సర్కార్ ఐదేళ్లు కూడా ఉండటం కష్టమే అని జోష్యం చెప్పాడు బాలయ్య. దాంతో ఆయన మానసికంగా బాగాలేరంటూ వైసీపీ నాయకులు కూడా విమర్శించారు.
బాలకృష్ణ (Balakrishna/Photo)
బాలకృష్ణ (Balakrishna/Photo)


ఇప్పుడు పోసాని దీనిపై స్పందించాడు. ముఖ్యంగా బాలకృష్ణ కోపంగా మాట్లాడినా.. విమర్శించినా.. ఒకవేళ తిట్టినా కూడా అది అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చేసాడు పోసాని. బాలయ్య కోపం ఒక నిమిషం కూడా ఉండదని చెప్పాడు ఈయన. ఆ తర్వాత మళ్లీ మామూలు మనిషి అయిపోతాడని.. కాబట్టి బాలయ్య తిట్లను సీరియస్‌గా తీసుకోవద్దని సూచించాడు పోసాని కృష్ణమురళి. బాలకృష్ణ హానెస్ట్ ఫెలో అని సర్టిఫికేట్ ఇచ్చాడు పోసాని.
బాలయ్య పోసాని (balakrishna posani)
బాలయ్య పోసాని (balakrishna posani)

ఆయన సంపాదన కోసం రాజకియాల్లోకి రాలేదని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ బాలకృష్ణ కోప్పడినా కూడా సమాజానికి నష్టమేమి లేదని.. ఎవరికీ ఏం నష్టముండదని చెప్పుకొచ్చాడు పోసాని. మరోవైపు ఏపీలో ఉన్నది జగన్ సర్కార్ అని.. ఎన్టీఆర్ సర్కార్ కాదని గుర్తు చేసాడు. అప్పట్లా వెన్నుపోటు పొడిపించుకోడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నా పొడిపించుకోడానికి అక్కడున్నది ఎన్టీఆర్ కాదు జగన్ అని గుర్తు చేసాడు పోసాని. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: June 7, 2020, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading