బాలయ్య ఇష్యూపై పోసాని రియాక్షన్.. ఆయన తప్పు చేసి డబ్బులు సంపాదించలేదు..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవి ఇష్యూనే నడస్తోంది.తాజాగా ఈ ఇష్యూపై పోసాని కృష్ణమురళి స్పందించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 5, 2020, 1:14 PM IST
బాలయ్య ఇష్యూపై పోసాని రియాక్షన్.. ఆయన తప్పు చేసి డబ్బులు సంపాదించలేదు..
బాలయ్యపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పోసాని
  • Share this:
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవి ఇష్యూనే నడుస్తోంది.  తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలకు తనను ఆహ్వానించకపోవడంపై బాలయ్య అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలసిందే కదా. అంతేకాదు బాలకృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు భూములు పంచుకోవడానికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపారని అనడం.. దానికి మెగా బ్రదర్ నాగబాబు.. బాలయ్యను సారీ చెప్పమని అడగం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. సోషల్ మీడియా వేదికగా నందమూరి, మెగా హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా ఈ ఇష్యూపై ప్రముఖ రచయత, నిర్మాత, దర్శకుడు,నటుడు అయిన పోసాని కృష్ణమురళి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలతో పాటు బాలయ్య, చిరంజీవి ఇష్యూలపై స్పందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ... ఆయనతో నేను పలు సినిమాలకు రచయతగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు బాలయ్యతో  రెండు మూడు సినిమాల్లో కలిసి యాక్ట్ చేసిన విషయాన్నిఈ సందర్భంగా ప్రస్తావించారు.

Posani krishna murali interestin comments on balakrishna and chiranjeevi issue,balakrishna,chiranjeevi,posani krishna murali,balakrishna posani krishna murali,balayya posani krishna murali,posani krishna murali interview,posani about balayya balakrishna,posani about chiranjeevi,posani youtube interview,tollywood,telugu cinema,chiranjeevi vs balakrishna,balakrishna facebook,chiranjeevi twitter,acharya,monarch,బాలకృష్ణ,చిరంజీవి,పోసాని కృష్ణమురళి,బాలయ్య పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి బాలకృష్ణ,పోసాని కృష్ణమురళి చిరంజీవి,పోసాని కృష్ణమురళి యూట్యూబ్ ఇంటర్వ్యూ
బాలయ్యపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పోసాని


ఇంకా పోసాని మాట్లాడుతూ.. బాలకృష్ణకు కోపం కాస్తా ఎక్కువే అన్నారు. అంతేకాదు ఆయన కోపానికి కారణం కూడా ఉంటుంది. వ్యక్తిగతంగా ఆయన ఎవరిని ఏమి అనరు. ముఖానికి ముసుకేసుకోవడం ఆయనకు తెలియదన్నారు. ఏది ఉన్నా ముఖం మీదే అనేస్తారు. మంచి ఉంటే మంచి... చెడు ఉంటే చెడు. మేకప్ ఉంటే ఒకలా.. మేకప్ లేకపోతే మరోలా ఉండరన్నారు. చిన్నోడు పెద్దోడు అని తేడా చూడరు. సీఎం అయినా.. చిన్నావాళ్లైనా అందిరినీ ఒకేలా గౌరవిస్తాన్నారు పోసాని. మనకు ఏదైనా జెన్యూన్ ప్రాబ్లెమ్ ఉంటే వెంటనే స్పందిస్తారన్నారు. చాలా డీసెంట్ మనిషి. అవినీతి అక్రమాలు అనేవి బాలయ్యలో లేవు.  అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న బాలయ్యతో పాటు ఆయన అన్నదమ్ములు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. నాన్న రాజకీయాన్ని ఎపుడు పైరవీలకు వాడుకోలేదు. ఎన్టీఆర్ కొడుకులు ఇప్పటికీ అందరు కష్టపడే డబ్బులు సంపాదించుకుంటున్నారన్నారు. ఆయాచితంగా వాళ్లు ఏది ఆశించడం వారిలో చూడలేదన్నారు. మరోవైపు పోసాని..  చిరంజీవితో మంచి అనుబంధమే ఉందన్నారు. ఆయనతో నేను ఖైదీ నంబర ్150 సినిమా చేసానన్నారు. మరోవైపు ఆయన హీరోగా నటించిన అల్లుడా మజాకా సినిమాకు నేను కథను అందించానన్నారు. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టమన్నారు. నా యాక్టింగ్‌ అంటే ఆయకు ఇష్టమన్నారు. ఆయన కూడా కష్టపడే పైకొచ్చారని చెప్పుకొచ్చారు పోసాని.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 5, 2020, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading