POSANI KRISHNA MURALI FIRES ON TDP PRESIDENT CHANDRABABU NAIDU OVER SEXUAL HARRASMENT ALLEGATIONS ON LAKSHMI PARAVATHI TA
లక్ష్మీ పార్వతి లైంగిక ఆరోపణలపై బాబుపై ఫైర్ అయిన పోసాని..
పోసాని కృష్ణమురళి (ఫేస్ బుక్ ఫోటో )
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఒక రోజు గడువు మాత్రమే ఉంది. అందులో ఏపీలో ఈ పొలిటికల్ హీట్ కాస్తా ఎక్కువగానే ఉంది. ఎన్నికల వేళ పై చేయి సాధించడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. లక్ష్మీ పార్వతి లైంగిక ఆరోపణలపై పోసాని తనదైన శైలిలో స్పందించారు.
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఒక రోజు గడువు మాత్రమే ఉంది. అందులో ఏపీలో ఈ పొలిటికల్ హీట్ కాస్తా ఎక్కువగానే ఉంది. ఎన్నికల వేళ పై చేయి సాధించడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకురాలు స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి నుంచి రక్షణ కావాలని కోటి అనే వ్యక్తి వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై లక్ష్మీ పార్వతితో పాటు వైసీపీ శ్రేణులు స్పందించాయి. చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్నికల వేళ లక్ష్మీ పార్వతి ఇమేజ్ను డామేజ్ చేయాలని కాావాలనే ఆమెపై ఈ ఆరోపణలు చేయించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదంపై లక్ష్మీ పార్వతి స్పందిస్తూ ఇదంత చంద్రబాబు కుట్రగా అభివర్ణిస్తూ ఈ విషయమై లీగల్‌గా పోరాటం చేస్తానని చెప్పింది.
లక్ష్మీ పార్వతి, చంద్రబాబు
తాజాగా లక్ష్మీ పార్వతిపై లైంగిక ఆరోపణలపై పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో స్పందించాడు. లక్ష్మీ పార్వతి అపఖ్యాతి పాలు చేయాలని కావాలనే టీడీపీ ఈ కుట్రకు తెరతీసిందన్నారు. అంతేకాదు ఆమెపై కక్షతో కేసులు పెట్టించి అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డాడు. 70 ఏళ్ల వయసున్న లక్ష్మీపార్వతిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అంతేకాదు అమ్మమ్మ వయసులో ఉన్న ఆమెపై ఈ తరహా ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. రాజకీయాల్లో పై చేయి సాధించడానికి ఇంతగా దిగజారిపోవడం దారుణమన్నారు. లక్ష్మీ పార్వతిపై లైగింప ఆరోపణలు తనను తీవ్రంగా బాధించయన్నారు. ఇప్పటికే లక్ష్మీ పార్వతికి బాసటగా జీవితా రాజశేఖర్‌తో పాటు పోసాని కృష్ణ మురళి కూడా అండగా నిలిచారు. ఏమైనా ఎన్నికల వేళ టీడీపీ ఇలాంటి పనులకు పాల్పడటం నేరమన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.