Sunny Leone: పెద్ద మనసు చాటుకున్న సన్ని లియోన్..

సన్నీలియోన్.. అసలు పరిచయం అక్కర్లేని పేరు ఈమెది. ఆ పేరు వింటే ఆమె అభిమానుల ఊహలు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడో విహరిస్తుంటాయి.తాజాగా ఈ భామ తను చేసిన పనితో గొప్ప మనసు చాటుకున్నారు.

news18-telugu
Updated: October 6, 2019, 2:25 PM IST
Sunny Leone: పెద్ద మనసు చాటుకున్న సన్ని లియోన్..
సన్ని లియోన్ (Instagram/Photo)
  • Share this:
సన్నీలియోన్.. అసలు పరిచయం అక్కర్లేని పేరు ఈమెది. ఆ పేరు వింటే ఆమె అభిమానుల ఊహలు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడో విహరిస్తుంటాయి. రసిక ప్రియులకు ఆమె ఓ శృంగార దేవత. పలు ఐటెమ్ సాంగ్స్ తో తెలుగు యూత్ గుండెల్లో కిరాక్ పుట్టించింది. ఉత్తరాది.. దక్షిణాది రెండుచోట్లా సన్నీ తనదైన శైలిలో ఐటెమ్ నంబర్స్‌తో  ట్రీటిచ్చింది.తాజాగా ఈ భామ తను చేసిన పనితో గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా సన్ని లియోన్..క్యాన్సర్‌తో పోరాడేవారి కోసం తన వంతు సాయం చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం తను వేసిన పెయింటింగ్స్‌ను వేలానికి పెట్టింది ఈ భామ. ఈ వేలంలో వచ్చిన డబ్బులను క్యాన్సర్ పేషెంట్స్‌కు ఇవ్వనున్నట్టు తెలిపారు.





ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.క్యాన్సర్‌తో పోరాడుతున్న నిరుపేదలకు నా వంతు ఆర్ధిక సాయం చేయడం కోసం ఈ పెయింటింగ్‌ను వేలానికి పెడుతున్నట్టు తెలిపింది. ఈ పెయింటింగ్స్ వేసేటపుడు వారి గురించే ఆలోచించాను అంటూ చెప్పుకొచ్చింది.క్యాన్సర్‌తో పోరాడుతున్న పేదవారికి ఎవరికి తోచినంత వారు సాయం చేయమని కోరింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 6, 2019, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading