Nithiin | Macherla Niyojakavargam | యువ హీరో నితిన్ పోయిన సంవత్సర మూడు సినిమాలతో పలకరించారు. అయితే అందులో ‘రంగ్ దే’, చెక్’ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఆ తర్వాత విడుదలైన ‘మాస్ట్రో’ (Maestro) డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించుకుంది. ఆక నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam movie). ఈ సినిమాకు ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్ చేస్తోంది. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కేథరిన్ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 12, 2022 న థియేటర్లలో భారీగా విడుదలకానుంది. ఇక ఈ సినిమాను రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. పోరీ సూపరో (Pori Superoo) అంటూ సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాహుల్ సిప్లింగంజ్, గీతా మాధురి పాడారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. నితిన్ రెండు స్టైలిష్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. కృతి శెట్టి గ్లామర్‌తో వావ్ అనిపించింది. ఇక మరోవైపు ప్రచారంలో భాగంగా రేపు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Here's the Pumping Mass Number #PoriSuperoo from #MacherlaNiyojakavargam ????
▶️ https://t.co/KIhHb923Cy
Experience the Full SONG In Cinemas on Aug 12th✅@IamKrithiShetty @SrSekkhar @SreshthMovies #MahathiSwaraSagar @adityamusic#MNVFromAug12th
— nithiin (@actor_nithiin) August 6, 2022
ఈ చిత్రం కథ విషయానికి వస్తే... దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను నితిన్ ఏ విధంగా చక్కదిద్దాడనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఇక ప్రచారంలో భాగంగా ఇటీవలే మాచర్ల యాక్షన్ ధమ్కీ రిలీజ్ చేశారు. ఈ సాలిడ్ వీడియో నెక్స్ట్ లెవెల్ మాస్ గా ఉందని చెప్పాలి. నితిన్ డైలాగ్ తో మంచి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇందులో కనిపిస్తుంది. ‘ మహాభారతంలో ధర్మాన్ని కాపాడేందుకు లక్షలాది మంది తమ సమాధుల్ని పునాదులుగ వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం.. నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం’ అంటూ సాగే నితిన్ డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి.
అలాగే మహతి సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో లెవెల్లో అనిపిస్తుంది. ఈ సినిమాలోని 'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్ వీర మాస్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. నితిన్ తొలి చిత్రం 'జయం' లోని రాను రాను అంటూనే చిన్నదో పాట పల్లవిని ఈ పాటలో చేర్చడం మరింత స్పెషల్ ఎట్రాక్షన్ ని తెచ్చింది. 'రారా రెడ్డి' పాట ప్రస్తుతం ఇంటర్నెట్ సెన్సేషన్ గా దూసుకుపోతుంది. ఈ పాటకు లక్షలాది సంఖ్యలో రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై సందడి చేస్తున్నాయి. ప్రతి మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్ పై 'రారా రెడ్డి' పాటే టాప్ ట్రెండ్ లో వుండటం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krithi shetty, Macherla Niyojakavargam, Nithiin, Tollywood news